‘నా ఉద్దేశం అదికాదు’ సవరించుకున్న ఒమర్ అబ్దుల్లా

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 12:40 PM

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి విషయంలో తను చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సవరించుకున్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో..

నా ఉద్దేశం అదికాదు సవరించుకున్న ఒమర్ అబ్దుల్లా
Follow us on

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి విషయంలో తను చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సవరించుకున్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుధ్ధరించాలని, ఇది ముందు షరతని ఆయన నిన్నటి తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపై పార్టీలో పెద్దఎత్తున రచ్ఛ మొదలైంది. నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అఘా రుహుల్లా మెహదీ తన పదవికి రాజీనామా చేశారు. మొదట ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ఆర్టికల్ 370, 35 ఏ లను పునరుధ్ధరించాలన్నది ప్రధాన డిమాండ్ అని,  రాష్ట్ర ప్రతిపత్తి అనేది చివరిదని మెహదీ అన్నారు. స్వయం ప్రతిపత్తిని కేంద్రం పునరుధ్దరించాలి.. అదే మన ప్రధాన డిమాండ్ కావాలి.. ఆ తరువాతే అసెంబ్లీ ఎన్నికలు అన్నారు.

కాగా..తన వ్యాఖ్యలను జర్నలిస్టులు వక్రీకరించారన్నట్టుగా వారిపై విరుచుకుపడిన ఒమర్ అబ్దుల్లా.. తన ఉద్దేశం అది కాదని, కేంద్రం జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని రద్దు చేయడాన్ని తను ఇప్పటికీ ఖండిస్తున్నానని అన్నారు. తన ఆర్టికల్ ని తప్పుగా అర్థం చేసుకోరాదని తమ పార్టీ నేతలను కోరారు.