ప్రేయసి పిలిచిందని రాత్రి గోడ దూకి వెళ్లాడు..! పాపం కరెంట్‌ షాక్‌ తగిలి..

ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేయసిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు బిశ్వజిత్ విద్యుత్ షాక్‌తో మరణించాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఇది హత్య అని, ప్రియురాలి కుటుంబం కుట్ర పన్ని చంపిందని ఆరోపిస్తూ మృతుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రేయసి పిలిచిందని రాత్రి గోడ దూకి వెళ్లాడు..! పాపం కరెంట్‌ షాక్‌ తగిలి..
Dead Body

Updated on: Sep 30, 2025 | 6:47 PM

ఏకాంతంగం కలిసేందుకు తన ప్రేయసి పిలిచిందని, రాత్రి పూట ఆమె ఇంటి గోడ దూకి వెళ్లాడు. ఎంతో సంతోషంగా వెళ్లిన అతను విద్యుత్‌ షాక్‌ తగిలి మృత్యువడిలోకి జారుకున్నాడు. ఈ విషాద ఘటన ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో చోటు చేసుకుంది. ధెంకనాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు కరెంట్‌ షాక్‌తో మరణించాడు. మృతుడిని సిమిలియా గ్రామానికి చెందిన బిశ్వజిత్ బెహెరాగా పోలీసులు గుర్తించారు. బిశ్వజిత్ తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడని సమాచారం.

ఆమె అతన్ని రాత్రికి తన ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది. ప్రియురాలి ఇంటి గోడ దూకిన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై నేలపై పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని దెంకనల్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే మృతుడి కుటుంబం మాత్రం ఇది హత్య అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం తీవ్రమైన మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో విద్యుదాఘాతంతో అతను మృతి చెందినట్లు పోలీసులు అంటున్నారు. అయితే అసలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన 28వ తేదీ రాత్రి జరిగింది. రెండు రోజుల తర్వాత మృతుడి కుటుంబం సదర్ పోలీస్ స్టేషన్‌లో హత్య ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ.. ప్రియురాలి కుటుంబీకులు కుట్ర పన్ని అతడిని ఇంటికి రప్పించి చంపారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి