బ్రతుకే భారం అనుకున్న వారికి భరోసా.. హెచ్‌ఐవీ జంటకు పెళ్లి జరిపించారు.. అంతా తానై నిలిచిన జిల్లా కలెక్టర్

|

Mar 01, 2021 | 4:28 PM

ఆ జంటకు ఏ వ్యాధి అయితే రాకూడదో అదే వచ్చింది. మాయదారి మహమ్మారి ధాటికి కుటుంబానికే దూరమయ్యారు. హెచ్‌ఐవీ సోకినవారంటే సమాజానికి లోకువయ్యారు.

బ్రతుకే భారం అనుకున్న వారికి భరోసా.. హెచ్‌ఐవీ జంటకు పెళ్లి జరిపించారు.. అంతా తానై నిలిచిన జిల్లా కలెక్టర్
Follow us on

HIV positive couple married : ఆ జంటకు ఏ వ్యాధి అయితే రాకూడదో అదే వచ్చింది. మాయదారి మహమ్మారి ధాటికి కుటుంబానికే దూరమయ్యారు. హెచ్‌ఐవీ సోకినవారంటే సమాజానిక లోకువ.. వారిని చుట్టుపక్కల వారితో పాటు రక్తబందీకులు సైతం దూరంగా ఉంచారు. అలాంటి ఓ జిల్లా కలెక్టర్ వారిని చేరదీసి ఆశ్రయం కల్పించింది. అంతేకాదు ఓ జంటకు పెళ్లి చేసి పుట్టినింటి వారిలాగా సాగనంపింది. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఆ జంటకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం దగ్గరుండి జరిపించిన జిల్లా కలెక్టర్‌నను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఇద్దరూ భయంకరమైన రోగంతో పీడించబడుతున్నారు. ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో తెలియని విషమ పరిస్థితి. దరిచేరనివ్వని సమాజం.. బ్రతకీడ్చడమే భారం.. టన్నిటినీ ఎదుర్కొని ఒక్కటయ్యింది ఓ కొత్త జంట. భయంకరమైన ఎయిడ్స్‌ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులు వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్‌పూర్‌లోని శ్రాద్ధ సంజీవని హెచ్‌ఐవీ సేవాశ్రమం ఇందుకు వేదికైంది. స్వయంగా బరంపురం కలెక్టర్‌ విజయ్‌ అమృత కులంగా దగ్గరుండి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఘనంగా వారి వివాహ తంతు నిర్వహించడం విశేషం.

ఆదివారం జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఇలాగే, ప్రభుత్వ కార్యదర్శి కార్తికేయ పాండ్యాన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు తరచుగా సామాజిక కళంకం, వివక్షను ఎదుర్కొంటారు. ఇటువంటి పరిస్థితులలో, జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు అభినందనీయమని పలువురు ప్రశంసలు కురిపించారు. పెళ్లిపై ఒడిశా సిఎం దృష్టి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్ష చూపేవారికి బలమైన సందేశాన్ని పంపుతుందంటూ మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం, ఒడిశాలో సుమారు 49,000 మంది హెచ్ఐవి / ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వ హెచ్ఐవి అంచనాల నివేదిక ప్రకారం, 2019 లో దేశంలో సుమారు 23.49 లక్షల మంది హెచ్ఐవి / ఎయిడ్స్ తో నివసిస్తున్నట్లు అంచనా.

ఇదీ చదవండి…  చదువులను మధ్యలో ఆపేసిన యువతకు చక్కటి అవకాశం.. ఉపాది శిక్షణతోపాటు ఫ్రైజ్ మనీగా రూ.8000.. ఎలా చేరాలో తెలుసా..