Viral Video: ఫుల్లుగా తాగండి.. తాగి ఊగండి.. ఇది ఇంట్లో వరకైతే పర్వాలేదు. కానీ, ఊరుమీద పడి ఊగితే ఎవరూ ఊరుకోరు కదా..! ఓ యువతి విషయంలో ఇదే జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే తప్పతాగి నానా రచ్చ చేసిన యువతికి నోయిడా పోలీసులు బిగ్ ఝలక్ ఇచ్చారు. ఫుల్లుగా మద్యం సేవించి, సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు.
అవును, ఢిల్లీలోని నోయిడాలో భవ్యరాయ్ అనే యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది. హౌసింగ్ సోసైటీ సెక్యూరిటీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. బండబూతులు తిడుతూ.. చిన్న విషయానికి నానా రచ్చ చేసింది. అతనిపై చేయి కూడా చేసుకుంది. గేటు తీయడానికి ఆలస్యం కావడంతో భవ్య రాయ్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
సెక్యూరిటీ గార్డ్‌ను చోక్కా కాలర్ పట్టుకుని భవ్యరాయ్ కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వాళ్లపై కూడా చిందులు వేసింది. ఇక సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ భవ్యరాయ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ये महिला सरेआम इस गार्ड से इतनी गुंडागर्दी और गाली गालौच कर रही है. ये किस प्रकार का घटियापन है. @noidapolice इस महिला के खिलाफ सख्त कार्यवाही बहुत ज़रूरी है. pic.twitter.com/SZqL4IBRjv
— Swati Maliwal (@SwatiJaiHind) August 21, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లీక్ చేయండి..