‘ఏకపక్ష చర్యలు వద్దు.. చిక్కులు తెచ్చుకోకండి…’ చైనా

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2020 | 4:11 PM

భారత-చైనా దళాల మధ్య లడఖ్ లోని గాల్వామా వ్యాలీలో ఘర్షణ అనంతరం.. దీనిపై స్పందించిన చైనా.. ఏకపక్ష చర్యలు తీసుకోవద్దని, చిక్కులను కొనితెచ్చుకోవద్దని పరోక్షంగా ఇండియాను హెచ్ఛరించింది. (ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు..

ఏకపక్ష చర్యలు వద్దు.. చిక్కులు తెచ్చుకోకండి... చైనా
Follow us on

భారత-చైనా దళాల మధ్య లడఖ్ లోని గాల్వామా వ్యాలీలో ఘర్షణ అనంతరం.. దీనిపై స్పందించిన చైనా.. ఏకపక్ష చర్యలు తీసుకోవద్దని, చిక్కులను కొనితెచ్చుకోవద్దని పరోక్షంగా ఇండియాను హెచ్ఛరించింది. (ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. అయితే చైనా వైపున కూడా కొందరు మరణించారని భారత ఆర్మీ.. తన తదనంతర ప్రకటనలో పేర్కొంది). బీజింగ్ లో మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్.. భారత దళాలు తమ భూభాగంలోకి చొచ్ఛుకు వస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఇలా రెండు సార్లు జరిగిందని, మా దేశ సైనిక సిబ్బందిని రెచ్ఛగొట్టడం, దాడులు చేయడంవంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దీని కారణంగా సరిహద్దుల్లో ఉభయ దేశాల సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మేం భారత ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలుపుతున్నాం అని లిజియన్ అన్నారు. ఏక పక్ష చర్యలు తీసుకోకండి.. దీనివల్ల బోర్డర్ లో జటిలమైన పరిస్థితి తలెత్తుతుంది అని వ్యాఖ్యానించారు. కాగా- గాల్వామా వ్యాలీలో జరిగిన ఘర్షణలో కాల్పులు జరగలేదని, లాఠీలు, రాళ్లతో ఉభయ దళాల మధ్య దాడులు జరగడంతో ఓ సైనికాధికారి సహా ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఇండియన్ ఆర్మీ వివరించింది.