ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే..!

| Edited By:

Jan 19, 2020 | 12:25 PM

కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ […]

ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే..!
Follow us on

కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా.. మతరాజకీయాలు చేసిందని.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేశారన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుందన్నారు.
ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని ఆరోపించారు. పూర్వులు చేసిన దేశ విభజనకు ప్రాయశ్చిత్తమే… ఈ పౌరసత్వ సరవణ చట్టమని మంత్రి సారంగీ పేర్కొన్నారు.