బీజేపీలో చేరే ప్రసక్తి లేదు….అలాంటి పరిస్థితే వస్తే.. సిబల్ గర్జన… మరి శివసేనతో మీ జట్టు మాట? జితిన్ ప్రసాద కౌంటర్

కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద పార్టీనివీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. పార్టీలో సమూల మార్పులు చేయాలంటూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో జితిన్ ప్రసాద కపిల్ సిబల్ కూడా ఉన్నారు..

  • Publish Date - 11:26 pm, Thu, 10 June 21 Edited By: Anil kumar poka
బీజేపీలో చేరే ప్రసక్తి లేదు....అలాంటి పరిస్థితే వస్తే.. సిబల్ గర్జన... మరి శివసేనతో మీ జట్టు మాట? జితిన్ ప్రసాద కౌంటర్
No Question Of Joining In Bjp Says Congress Leader Kapil Sibal

కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద పార్టీనివీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. పార్టీలో సమూల మార్పులు చేయాలంటూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో జితిన్ ప్రసాద కపిల్ సిబల్ కూడా ఉన్నారు. అయితే తాజాగా జితిన్ ప్రసాద కమలం పార్టీలో చేరడంపై స్పందించిన సిబల్…వ్యక్తిగత ప్రయోజనాలకోసమే ఆయన ఆ పార్టీలోకి జంప్ అయ్యారని ఆరోపించారు. తనను కాంగ్రెస్ పార్టీ డెడ్ వుడ్ గానో.. అవసరం లేని వ్యక్తి గానో పరిగణించినప్పుడు పార్టీని వీడిపోతానని అంతే తప్ప బీజేపీలో చేరబోనన్నారు. అందులో చేరడమంటే తాను మరణించినట్టే అని వ్యాఖ్యానించారు.. జితిన్ బీజేపీలో చేరడం ‘ప్రసాద రామ పాలిటిక్స్’ అని అభివర్ణించారు. అసలు ప్రసాద ఎందుకు పార్టీని వీడారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే జితిన్ ప్రసాద ఆయనకు కౌంటర్ ఇస్తూ… మహారాష్ట్రలో శివసేనతో మీరు జట్టు కట్టడమేమిటని ప్రశ్నించారు. నాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం…. బెంగాల్ లో మీ పార్టీ లెఫ్ట్ తో చేతులు కలపలేదా ?ఇదే సమయంలో కేరళలోనూ లెఫ్ట్ తో ఫైట్ చేస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడండి అన్నారు.

మరో వైపు కాంగ్రెస్ నుంచి మరికొందరు బీజేపీలో చేరే సూచనలున్నాయని అంటున్నారు. జితిన్ ప్రసాదను బీజేపీ ‘ఆప్యాయంగా’ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి విదితమే.. ఆయనతో బాటు ఆయన సహచరులు కూడా కమలం కండువా కప్పుకున్నారు. కాగా ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం విశేషం. తన ట్విటర్ లో కేంద్రాన్ని, బీజేపీని దుయ్యబట్టే ఆయన కామ్ అయిపోయారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రెచ్చిపోతున్న ఆకతాయిలు హైదరాబాద్ పోలీసుల మీద ఎటాక్ చేసిన యువత :young mans attack on police video.

ఏపీలోనూ పరీక్షలు రద్దవుతాయా?స్టూడెంట్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా :AP Intermediate Exams Live Video.

శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తున్న మోనాలిసా..నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో.: woman riding a horse video.