Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా.. రాజ్‌భవన్‌కు ఒంటరిగానే..

Bihar Political Crisis: రాజ్‌భవన్‌కు చేరుకున్నారు సీఎం నితీష్‌కుమార్‌. గవర్నర్‌ ఫగ్‌ చౌహాన్‌ను రాజీనామా లేఖ అందించారు. పాదయాత్రగా వెళ్లి రాజీనామా..

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా.. రాజ్‌భవన్‌కు ఒంటరిగానే..
Nitish Kumar

Updated on: Aug 09, 2022 | 4:39 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు సీఎం నితీష్‌కుమార్‌. గవర్నర్‌ ఫగ్‌ చౌహాన్‌ను రాజీనామా లేఖ అందించారు. పాదయాత్రగా వెళ్లి రాజీనామా చేస్తారని మీడియాలో ప్రచారం సాగినా.. అలా జరగలేదు.. రాజ్‌భవన్‌కు ఒంటరిగానే చేరుకుని రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందించారు నితీష్‌. జేడీయూ నేత నితీశ్ కుమార్ రాజ్ భవన్‌లో గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరిలో ఏకాభిప్రాయం ఉందన్నారు. తనకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. రాజీనామా అనంతరం ఎన్డీయే నుంచి వైదొలిగినట్లు నితీశ్ ప్రకటించారు.

అంతకుముందు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ అవమానానికి గురిచేస్తోందని.. జేడీయూను అంతమొందించేందుకు కుట్ర పన్నిందని అన్నారు. 2020 నుంచి ప్రస్తుత కూటమి తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని సీఎంకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకపోతే పార్టీకి మేలు జరగదని సీఎం అన్నారు.

బీజేపీ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తనను బలహీనం చేసేందుకు బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. చాలాసార్లు బీజేపీ తనను అవమానించిందన్నారు నితీష్‌. ఆర్జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నితీష్‌. తేజస్వియాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది .కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేలతో సమావేశం తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు నితీష్‌కుమార్‌.

యునైటెడ్‌ జనతాదళ్‌ను చీల్చేందుకు అమిత్‌షా కుట్ర చేశారన్నది నితీష్‌ ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే సీన్‌ రిపీట్‌ చేసి RCP సింగ్‌ను సీఎం చేయడానికి అమిత్‌షా పధకం రచించారని ఆరోపిస్తున్నారు జేడీయూ నేతలు. నితీశ్‌కుమార్‌ ముందే మేల్కొని.. బీజేపీకి దూరం జరుగుతున్నారని అంటున్నారు. మరోవైపు.. బీహార్‌ రాజకీయాలపై చర్చించేందుకు ఢిల్లీలో బీజేపీ కోర్‌ కమిటీ భేటీ సమావేశం కాబోతోంది.

మరిన్ని జాతియ వార్తల కోసం..