
ఇవాళ కూడా సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మరో రంగానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించనుండగా, ఏం ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడతల వారీగా ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తామని నిన్నటి మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, నిన్న కంపెనీలలకు పలు వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో ఏ అంశాలను ప్రాధాన్యంలోకి తీసుకుంటారనే దానిపై పలువురు విశ్లేషకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరో ప్రధాన అంశం డిమాండ్ అండ్ సప్లై మీద కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.