విషాదం.. పెళ్లైన 10 రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్త జంట

పెళ్లైన 10 రోజులకే ఓ కొత్త జంట యాక్సిడెంట్‌లో కన్నుమూసింది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురంలో

విషాదం.. పెళ్లైన 10 రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్త జంట

Edited By:

Updated on: Nov 16, 2020 | 11:13 AM

Kerala road accident: పెళ్లైన 10 రోజులకే ఓ కొత్త జంట యాక్సిడెంట్‌లో కన్నుమూసింది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సలాహుద్దీన్‌(25), ఫాతిమా జమున(19) లు మరణించారు. యాక్సిడెంట్‌లో సలాహుద్దీన్‌ అక్కడికక్కడే మరణించగా.. ఫాతిమాను ఆసుపత్రికి తరలించే క్రమంలో కన్నుమూసింది. మరో వాహనాన్ని దాటుకునే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పడంతో వారిద్దరు కింద పడ్డారు. అదే సమయంలో అటు నుంచి వస్తోన్న లారీ కింద ఈ ఇద్దరు పడ్డట్లు తెలుస్తోంది. కాగా ఫాతిమా బంధువుల ఇంటి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Read More:

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి లొస్లియా తండ్రి మృతి.. అప్పట్లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి..!

కర్నూల్ జిల్లాలో దారుణం.. నాటు బాంబు పేలి ఏడోతరగతి విద్యార్థి మృతి