మానస్‌ సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న ప్రయాణం

| Edited By:

May 08, 2020 | 6:09 PM

మానస్‌ సరోవర్ యాత్రికులకు ఇకపై ప్రయాణం తగ్గనుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా మానస సరోవర్ వెళ్లే వారి కోసం ఓ కొత్త మార్గం నిర్మితమైంది.

మానస్‌ సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న ప్రయాణం
Follow us on

మానస్‌ సరోవర్ యాత్రికులకు ఇకపై ప్రయాణం తగ్గనుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా మానస సరోవర్ వెళ్లే వారి కోసం ఓ కొత్త మార్గం నిర్మితమైంది. ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులా నుంచి చైనా బోర్డర్‌ అయిన లిపులేఖ్ పాస్‌లను కలిపే మార్గాన్ని బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజేష‌న్ నిర్మించింది. ఈ మార్గాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. దీంతో 90 కిలో మీటర్ల పర్వతారోహణ ప్రయాణం తగ్గనుండగా.. మూడు రోజుల్లో అక్కడకు చేరుకోనున్నారు. అంతేకాదు ఈ మార్గం ద్వారా చైనా స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లే అవ‌కాశ‌ముంటుంద‌ని బోఆర్వో ఉన్నతాధికారి ఒక‌రు వెల్లడించారు.

కాగా టిబెట్‌లో కైలాష్ మానస సరోవర్ ఉంటుంది. అక్కడికి భక్తులు వెళ్లేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు రెండు మార్గాల ద్వారా యాత్రను నిర్వహిస్తూ వస్తోంది. ఆ యాత్రకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళుతూ.. దేవదేవుని దర్శించుకొని వస్తుంటారు.

Read this Story Also: భర్తను హత్య చేసి.. కరోనా ఖాతాలో వేసిన భార్య..!