భారత్ ఒడిలోకి చేరుకున్న రాఫెల్.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏమన్నారంటే..?

ఫ్రాన్స్ నుంచి బ‌య‌లుదేరిన అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు.. బుధవారం సాయంత్రం అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరాయి. దాదాపు ఏడు వేల..

భారత్ ఒడిలోకి చేరుకున్న రాఫెల్.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏమన్నారంటే..?

Edited By:

Updated on: Jul 29, 2020 | 6:21 PM

ఫ్రాన్స్ నుంచి బ‌య‌లుదేరిన అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు.. బుధవారం సాయంత్రం అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరాయి. దాదాపు ఏడు వేల కిలోమీట‌ర్ల నుంచి వన్ స్టాప్‌తో భారత్‌ ఒడిలోకి చేరుకున్నాయి. భారత గగనతలంలోనే రాఫెల్‌కు ఘన స్వాగతం లభించింది. ఇక అంబాలా ఎయిర్‌ బేస్‌లో ల్యాండ్‌ అయిన తర్వాత.. రాఫెల్ ఫైటర్ జెట్‌లను ఉద్దేశించి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్ చేశారు.

రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండైన క్ష‌ణం.. భార‌త సైనిక చ‌రిత్ర‌లో నవ శకం మొదలైనట్లేనని పేర్కొన్నారు. బ‌హుళ సామ‌ర్థ్యాలు క‌లిగిన ఈ రాఫెల్ ఫైటర్‌ జెట్స్‌ భార‌త వాయుసేన‌ను మరింత బ‌లోపేతం చేయనున్నట్లు తెలిపారు. అంబాలా ఎయిర్ బేస్‌లో రాఫెల్‌ విమానాలు ల్యాండ్‌ అయిన వీడియోను రాజ్‌నాథ్‌ సింగ్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 

Read More

భూమి పూజలో మోదీతో కూర్చోబోతున్న మరో వ్యక్తి.. ఎవరో తెలుసా..?