Varun Singh: జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు.. స్కూల్ విద్యార్థులకు రాసిన లేఖలో వరుణ్ సింగ్‌ వ్యాఖ్యలు

|

Dec 10, 2021 | 5:39 PM

Army Chopper Crash: తమిళనాడులోని కున్నూర్‌కు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందగా..

Varun Singh: జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు.. స్కూల్ విద్యార్థులకు రాసిన లేఖలో వరుణ్ సింగ్‌ వ్యాఖ్యలు
Varun Singh
Follow us on

తమిళనాడులోని కున్నూర్‌కు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందగా, ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి వరుణ్ సింగ్‌. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను గ్రూప్ కెప్టెన్‌ వరుణ్‌సింగే నడిపారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌లో 14 మంది ప్రయాణిస్తుండగా.. వరణ్ సింగ్ మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడు. వరుణ్ సింగ్‌కు కేవలం 45 శాతం మాత్రమే గాయాలు కావడంతో నిన్ననే హుటాహుటినా ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌లో బెంగళూర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు.

మొక్కవోని ధైర్యానికి మారు పేరు వరుణ్‌సింగ్‌. ఎంతో మంది ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో హర్యానాలోని చండీమందిర్‌లో తాను చదువుకున్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఆయన రాసిన లేఖతో వరుణ్‌సింగ్‌ ఎలాంటి వ్యక్తే తెలుస్తుంది. మీరు చదువులో సగటు విద్యార్థిగా ఉన్నా.. మీరు ఎంచుకున్న రంగంలో మాత్రం అంకిత భావంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని విద్యార్థులకు రాసిన లేఖలో వరుణ్‌సింగ్‌ తెలిపారు. జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దని సూచించారు. దీంతో ఎంతో మంది జీవితాలను ప్రభావం చేయగలిగే వ్యక్తి త్వరగా కోలుకోవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు బెంగళూర్ లోని ఆసుపత్రిలో వరుణ్‌సింగ్‌కు చికిత్స కొనసాగుతోంది. వరుణ్‌సింగ్‌ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థపై ఉంచి వరుణ్ సింగ్‌కు చికిత్స అందిస్తున్నారు.

Army Chopper Crash

వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కేపీ సింగ్, ఆయన భార్య ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్‌కు చెందిన వారు కాగా ప్రస్తుతం భోపాల్‌లో స్థిరపడ్డారు. హెలికాఫ్టర్ దుర్ఘటన జరిగిన సమయంలో వారు ముంబైలో ఉన్న వరుణ్ సింగ్ సోదరుడి నివాసంలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెల్లింగ్‌టన్‌కు బయల్దేరి వెళ్లారు. చికిత్స కోసం తరలిస్తున్న సమయంలో కూడా వరుణ్‌సింగ్‌ కూడా తన భార్యతో మాట్లాడాలని ఉందని అధికారులను కోరినట్టు తెలుస్తోంది.

Also Read..

Bipin Rawat: ఓ ఆర్టిస్టు బిపిన్ రావత్‌కు ఘన నివాళి.. రావి ఆకుపై రావత్ కళాకృతి ..దేశ భక్తి గీతం.. వీడియో వైరల్..

Omicron Alert: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలకు ICMR కీలక ఆదేశాలు