మ్యాప్ వివాదం పక్కన పెట్టి, మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్

| Edited By: Pardhasaradhi Peri

Aug 15, 2020 | 7:12 PM

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి శనివారం ప్రధాని మోదీకి  ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియా నాన్-పర్మనెంట్ సభ్యత్వ దేశంగా..

మ్యాప్ వివాదం పక్కన పెట్టి, మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్
Follow us on

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి శనివారం ప్రధాని మోదీకి  ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియా నాన్-పర్మనెంట్ సభ్యత్వ దేశంగా ఎన్నికైనందుకు అభినందించారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఇద్దరు నేతలూ కోవిడ్-19 పై పోరులో కలిసికట్టుగా కృషి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత-నేపాల్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పరిఢవిల్లాలని మోదీ కోరారని, దీనితో  శర్మ ఓలి కూడా ఏకీభవించారని ఈ  శాఖ వెల్లడించింది. నేపాల్ ఈ మధ్య రూపొందించిన పొలిటికల్ మ్యాప్ గురించి గానీ, సరిహద్దు సమస్యల ప్రస్తావనగానీ వీరి చర్చల్లో రాలేదని తెలిసింది.

లిపు లేఖ్ సహా భారత భూభాగంలోని మరో రెండు ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ గత నెలలో ఓ రాజకీయ మ్యాప్ ను రూపొందించింది. దానిపై ఆ దేశంలో ప్రతిపక్షాలు వివాదం లేవనెత్తడంతో.. ఓలి కాస్త వెనక్కి తగ్గారు. తన పదవికే గండం వచ్ఛేలా కనబడడంతో ఆయన చల్లబడి మళ్ళీ దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా-2019-20 ఆర్ధిక సంవత్సరంలో ‘ఎయిడ్’ టు నేపాల్’ పేరిట భారత ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1200 కోట్లు కేటాయించింది.