Sushant Singh: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుపై వస్తోన్న వార్తలను ఖండించిన ఎన్‌సీబీ అధికారులు.. దర్యాప్తు ఇంకా ఉందంటూ..

Sushant Singh Rajput Drug Case: గతేడాది జూన్‌లో బాలీవుడ్ హీరో సుశాంత్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశాలు లేకే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న దాని నుంచి మొదలైన వాదన.. చివరికి బాలీవుడ్‌లో..

Sushant Singh: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుపై వస్తోన్న వార్తలను ఖండించిన ఎన్‌సీబీ అధికారులు.. దర్యాప్తు ఇంకా ఉందంటూ..

Updated on: Feb 11, 2021 | 6:25 PM

Sushant Singh Rajput Drug Case: గతేడాది జూన్‌లో బాలీవుడ్ హీరో సుశాంత్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశాలు లేకే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న దాని నుంచి మొదలైన వాదన.. చివరికి బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారానికి దారి తీసింది. ఈ అంశం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సుమారు ఎనిమిది నెలలుగా విచారణ జరుగుతోన్న ఈ కేసులో అధికారులు ఎంతో మందిని విచారించారు. ఈ క్రమంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ జరుపుతోంది.
సుశాంత్‌ సింగ్‌ కేసు విషయంలో అధికారులు ముందుగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారని గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎన్‌సీబీ తాజాగా ఖండించింది. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా సుశాంత్‌ సింగ్‌ వ్యవహారంలో జరిగిన మనీ లాండరింగ్‌కు సంబంధించిన వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌సీబీకి కీలక సమాచారాన్ని అందించిందని వస్తోన్న వార్తలను కూడా అధికారులు ఖండించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న చాలా మంది మొబైల్‌ ఫోన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారంలో ఎన్‌సీబీ రెండు డ్రగ్స్‌ సంబంధిత కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అరెస్ట్‌ అయిన సుశాంత్‌ స్నేహితురాలు రియా, ఆమె సోదరుడు శోవిక్‌ అరెస్ట్‌ అయి ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నారు. ఇక ఈ కేసు విషయంలో అధికారులు ఎంతో మందిని విచారించారు. ఇప్పటి వరకు డ్రగ్స్‌ వ్యవహారంలో చాలా మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌కు చెందిన బడా స్టార్ల పేర్లు వినిపించాయి. ఇందులో భాగంగానే.. సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, దీపికా పదుకొణె, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కరీష్మ ప్రకాష్‌ వంటి తారలు విచారణకు హాజరైన విషయం తెలిసింది. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Loading...
Unable to load recommendations.
Follow Us