
గాడ్ సేవ్ ద కింగ్ అనేది బ్రిటిష్ ప్రార్థనాగీతం. దాన్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని బ్రిటిషర్స్ ప్రయత్నిస్తున్న సమయం. ఆ వార్త బంకిమ్‌చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసింది. పెల్లుబికిన ఆ ఆగ్రహమే.. ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది. అదే వందేమాతరం గేయం అయింది. అదే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతినీ ఒక్కటి చేసింది. ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు పూర్తైన సమయంలో ఓ వివాదం రాజుకుంది. ఎందుకని? 2026 జనవరి 28.. వందేమాతరం గీతాన్ని పూర్తి స్థాయిలో.. అంటే మొత్తం ఆరు చరణాలు పాడాల్సిందేనని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చిన రోజు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం.. అధికారికంగా ఈ ఆరు చరణాలను నిర్ణీత రాగంలో ఆలపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘రాగ్ దేశ్’ రాగంలోప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, మిలిటరీ బ్యాండ్‌లలో వాడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం ఆరు చరణాల పూర్తి వెర్షన్‌ను కూడా ఇదే రాగంలో, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలి. వందేమాతరం పాడటానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా ఒక అధికారిక ప్రోటోకాల్ కూడా ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం అయిన...