మైసూర్ ప్యాలెస్లో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుతున్నాయి. కర్ణాటకలో పది రోజులపాటు దసరా వేడుకలు జరుగుతాయి. దానిలో భాగంగా.. ఇవాళ చివరి రోజు కావడంతో.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా జంబూ సవారి ఊరేగింపు కొనసాగుతోంది. దసరా జంబూ సవారి ఊరేగింపుకు 11 మంది ఐపీఎస్‌ల సారథ్యంలో 4 వేల మంది పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఐదు హామీల శకటాలు మైసూరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఐదు పథకాల సందేశాన్ని తెలియజేసేలా శకటాలు ఏర్పాటు చేశారు. శక్తి యోజన, గృహలక్ష్మి, అన్నభాగ్య యోజన, యువనిధి యోజన కార్యక్రమాలతో శకటాలు రూపొందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి