Bhangarh Fort: ఈ కోటలో దెయ్యాల విహారం.. చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు!

|

Jan 09, 2023 | 9:40 AM

సూర్యుడు అస్తమించిన తరువాత ఈ కోటలోకి వెళ్లినవారు తిరిగి బయటికి రావడం ఇంతవరకు జరగలేదు. అక్కడికి వెళ్లినవారు ఇంకెప్పటికీ కనిపంచకపోవడం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతుందోనని..

Bhangarh Fort: ఈ కోటలో దెయ్యాల విహారం.. చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు!
Bhangarh Fort Mystery
Follow us on

సూర్యుడు అస్తమించిన తరువాత ఈ కోటలోకి వెళ్లినవారు తిరిగి బయటికి రావడం ఇంతవరకు జరగలేదు. అక్కడికి వెళ్లినవారు ఇంకెప్పటికీ కనిపంచకపోవడం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. పర్యాటక ప్రదేశం అయినప్పటికీ సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ కోటలోకి ప్రవేశం నిషిద్ధం అనే బోర్డు కోట ముందు వేలాడుతూ ఉంటుంది. రాజస్థాన్‌లోని నాలుగు వందట ఏళ్ల నాటి భాంగఢ్ కోట గురించే మనం చర్చిస్తోంది. నిజానికి దీనిని దెయ్యాల కోట అని పిలుస్తారు. ఈ కోటలో భూతాలు, దెయ్యాలు నివాసం ఉంటున్నాయని, అత్యంత భయంకరమైన ప్రదేశంగా అక్కడి స్థానికుల నమ్మకం.

భాంగఢ్ కోటను 16వ శతాబ్దంలో రాజా మాధవ్ సింగ్ నిర్మించారు. ఆయన భార్య రాణి రత్నావతి. 1570లో కోట నిర్మాణం ప్రారంభిస్తే పూర్తి కావడానికి దాదాపు 16 ఏళ్లు పట్టిందట. ఐతే 1605లో కోటలో సుమారు 14 వేల మంది నివాసం ఉండేవారు. అక్కడ కేవలం 24 గంటల్లో ఉపద్రవం లాంటిది ముంచుకు రావడంతో రాజుతో పాటు సగంపైగా జనాభా అక్కడి నుంచి పారిపోయారట. వారంతా ఆమెర్ (ప్రస్తుత జైపూర్) వెళ్లి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఓ తాంత్రికుడు ఈ కోటలోని రాణిని వశం చేసుకోవడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో ఇక్కడి ప్రజలపై క్షుద్రశక్తులు ప్రయోగించాడని, అందువల్లనే ప్రజలు ఈ చోటు విడిచి వెళ్లిపోయారని కథలుగా చెబుతారు. కోటపై ఉండే వాచ్‌టవర్‌లో మాంత్రికుడు ఉంటాడట. అంతేకాకుండా రాత్రిపూట భాంగఢ్ కోటలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని, చీకటి పడిన తరువాత ఇక్కడికి వచ్చిన వారెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లడం జరగదని అంటుంటారు. గతంలో ఇక్కడ కొందరు మృతి చెందారని వారీ ఆత్మలే ఈ కోటలో సంచరిస్తుంటాయని అక్కడి ప్రజల విశ్వాసం.

ఇండియా పారానార్మల్ సొసైటీకి చెందిన సిద్ధార్థ్ బంట్వాల్ ఈ కోటలో పరిశోధనలు నిర్వహించారు. 2012లో సిద్ధార్థ్ బంట్వాల్ నేతృత్వంలో టీం ఓ రాత్రి అంతటా భాంగఢ్ కోటలో గడిపింది. వాళ్ల వద్ద ఉన్న పరికరాలతో పారానార్మల్‌కు చెందిన దృశ్యాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించారు కూడా. ఐతే వారికి అటువంటివి ఏవీ అక్కడ కనిపించలేదని సిద్ధార్థ్ బంట్వాల్ మీడియాకు వెల్లడించారు. అక్కడ రకరకాల జంతువులు నివాసం ఉంటున్నాయని, బహుశా వాటి అరుపులే రాత్రి వేళల్లో వనిపిస్తుంటాయని ఆయన అన్నానరు. రాత్రి వేళల్లో గబ్బిలాలు, పులులు, చిరుత పులులు కోట చుట్టుపక్కల సంచరిస్తుంటాయి. అందువల్లనే రాత్రి పూట ఇక్కడ ఉండడం ప్రమాదకరం అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.