టీమిండియా క్రికెటర్‌ షమీపై అతివాద ముస్లిం సంస్థల ఆగ్రహం… మ్యాచ్‌ ఆడుతూ నీళ్లు తాగడంపై అభ్యంతరం

ఆస్ట్రేలియాతో ఛాపియన్స్‌ ట్రోఫి సెమీఫైనల్‌ మ్యాచ్‌ విరామంలో టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ నీళ్లు , ఎనర్జీ డ్రింక్‌ను తాగడంపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్‌ మాసంలో రోజా పాటించకుండా షమీ పెద్ద పాపం చేశాడని జమాత్‌ సంస్థ చీఫ్‌ మౌలానా షాబుద్దీన్‌ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజాన్‌ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్‌లో ఉందని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్‌ ఆడుతూ నీళ్లను,

టీమిండియా క్రికెటర్‌ షమీపై అతివాద ముస్లిం సంస్థల ఆగ్రహం... మ్యాచ్‌ ఆడుతూ నీళ్లు తాగడంపై అభ్యంతరం
Cricketer Shami

Updated on: Mar 06, 2025 | 3:19 PM

ఆస్ట్రేలియాతో ఛాపియన్స్‌ ట్రోఫి సెమీఫైనల్‌ మ్యాచ్‌ విరామంలో టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ నీళ్లు , ఎనర్జీ డ్రింక్‌ను తాగడంపై అతివాద ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్‌ మాసంలో రోజా పాటించకుండా షమీ పెద్ద పాపం చేశాడని జమాత్‌ సంస్థ చీఫ్‌ మౌలానా షాబుద్దీన్‌ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజాన్‌ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్‌లో ఉందని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్‌ ఆడుతూ నీళ్లను, ఎనర్జీ డ్రింక్‌ను తాగి పెద్ద పాపం చేశాడని రిజ్వీ ఆరోపించారు. ఈ పాపానికి షమీని అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు.

రంజాన్‌ మాసంలో ప్రతీ ముస్లిం చేయాల్సిన తప్పనిసరి విధుల్లో ఒకటి ‘రోజా’ ను పాటించడం. ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ ‘రోజా’ను పాటించకపోతే పెద్ద నేరస్థులుగా అవుతారని రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా మరేదైనా పానీయాన్ని సేవించారు. ప్రజలు వారివైపు చూస్తూనే ఉన్నారు. మ్యాచ్‌ ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ‘రోజా’ని పాటించకుండా నీళ్లు తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని చెప్పారు. ‘రోజా’ను పట్టించుకోకపోవడం వల్లే నేరం చేశారన్నారు రిజ్వీ. వారు ఇలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతడు నేరస్థుడు. అతను దేవునికి సమాధానం చెప్పాలని అన్నారు.

మరోవైపు ముస్లిం సంఘాల ఆగ్రహంపై షమీ కుటుంబ సభ్యులు స్పందించారు. భారత్‌ ఓటమిని కోరకునే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతారని షమీ కుటుంబసభ్యులు మండిపడ్డారు.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల పోస్టులు నెటిజన్స్‌ పెడుతున్నారు. మహ్మద్ షమీ ఉపవాసం చేయకపోవడం అనేది పెద్ద నేరమేమీ కాదని పోస్టులు పెడుతన్నారు. “దేశం ఎల్లప్పుడూ మతం కంటే పెద్దది.” అని మరికొంతమంది షమీకి మద్దతుగా కామెంట్స్‌ పెడుతున్నారు

ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ 10 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కపూర్ కొన్నోలీ, కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాథన్ ఎల్లిస్‌ల కీలక వికెట్లు పడగొట్టాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ గాయపడ్డారు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతను పునరాగమనం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది.