Meghdoot Machines: గాలి నుంచి నీటిని తయారు చేసే ‘మేఘదూత్‌’.. తొలుత ఈ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు..

|

Sep 01, 2022 | 9:21 PM

ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ వినూత్నంగా ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా త్వరలో..

Meghdoot Machines: గాలి నుంచి నీటిని తయారు చేసే మేఘదూత్‌.. తొలుత ఈ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు..
Meghdoot Machine
Follow us on

Meghdoot Machines for water: ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ వినూత్నంగా ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా త్వరలో మేఘదూత్ మెషిన్‌ (AWG)ను ఈ రైల్వే స్టేషన్‌లో అమర్చనున్నారు. ఇంతకీ ఈ మేఘదూత్ మెషిన్‌ ఏం చేస్తుందో తెలుసా..గాలి నుంచి నీరు తయారు చేసి, ప్రయాణికులకు తాగు నీటి కొరత తీరుస్తుంది. ముంబైలో మొత్తం 5 రైల్వే స్టేషన్లలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి రైల్వే యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక మెషిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

నీరు జీవనాధారం. మనుషులతో సహా సర్వ ప్రాణులు నీటిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఐనప్పటికీ పలు మార్గాల్లో నీటి వృథా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేశం అతి వృష్టి, అనావృష్టి సమస్యను ఎదుర్కొంటోంది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ప్రధాన నగరాల్లో నీటి కొరత విలయతాండవం చేస్తోంది. వీటిల్లో ముంబై కూడా ఒకటి. వర్షాకాలంలో భారీ వర్షాలు, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ముంబై వాసులకు నీటి కొరత కొత్త కాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు తాగునీరు అందించేందుకు రైల్వే యంత్రం నానాతంటాలు పడుతోంది. ఈ క్రమంలో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని (మేఘదూత్ మెషిన్‌) ఏర్పాటు చేయనుంది. ఈ పరికరం కండెన్సేషన్ ఉపయోగించి చుట్టుపక్కల గాలి నుంచి నీటిని సంగ్రహిస్తుంది. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (IICT) మేఘదూత్ మెషిన్‌ను తయారు చేసింది. ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందిన ఈ మెషిన్‌ను మన దేశంలో తొలిసారిగా ముంబాయి రైల్వే స్వేషన్‌లో ప్రారంభించనున్నారు.