CBI director Subodh Jaiswal: మహరాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు ముంబై సైబర్ పోలీసులు శనివారం సమన్లు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచ్చినట్లు ముంబై సైబర్ విభాగం శనివారం పేర్కొంది. మహారాష్ట్రలో గతంలో జరిగిన పోలీసు అధికారుల బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారం కాస్త బహిర్గతం కావడంతో రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. 14న సుబోధ్ విచారణ అనంతరం మరికొంతమందికి సమన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read: