CJP: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్.. ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్.. ఏంటంటే?

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాక్‌రోచ్ జనతా పార్టీ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ముంబై పోలీసులకు కొత్త ఫిర్యాదు అందింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఐర్లాండ్‌ నుంచి నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు దాడురు కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

CJP: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్.. ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్.. ఏంటంటే?
Cockroach Janata Party Controversy

Updated on: Jul 22, 2026 | 12:56 PM

సోషల్‌ మీడియా నుంచి పుట్టుకొచ్చి దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీకి ముంబైలో ఊహించని షాక్ తగిలింది.ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించి పోలీసులకు కొత్త ఫిర్యాదు అందింది. పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఐర్లాండ్‌ నుంచి నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీలో ఉన్నా.. ఖాతా ‘Ireland Based’గా కనిపిస్తోందని ఆరోపించాడు.

ఖాతా నిర్వహణ, విదేశీ అనుసంధానంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. 2026 ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేశారని.. గత నెల రోజులుగా వేలాది ఫాలోవర్లు తగ్గి.. ఒక్కసారిగా లక్షలాది ఫాలోవర్లు పెరిగినట్లు సోషల్ మీడియా మానిటరింగ్ రిపోర్ట్ తేలిందని రాసుకొచ్చాడు.. వారంతా ఫేక్, కేవలం బాట్ ఫాలోవర్స్ అని.. ఈ ఖాతా వినియోగంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించాడు.

సోషల్ మీడియాలో కృత్రిమ ప్రజాదరణ సృష్టించేందుకు నకిలీ ఫాలోవర్లను ఉపయోగించి ఉండొచ్చని..ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా విదేశాల నుంచి నిర్వహిస్తున్నారా..? విదేశీ నిధులు అందాయా..? అనే కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. అలాగే సోనం వాంగ్‌చుక్‌ను తప్పుదారి పట్టించారని కూడా ఆయన తన ఫిర్యాదుదారులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us