Watch Video: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. లిఫ్ట్‌లో అవి తీసుకురావొద్దన్నందుకు..

మహారాష్ట్ర-ముంబైలోని మాల్వణీ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిఫ్ట్ వినియోగం విషయంలో ప్రారంభమైన ఆ చిన్న గొడవ పెద్ద ఘర్షణగా మారింది. అక్కడ నివసిస్తున్న ఓ కుటుంబంపై కొందరు యువకులు దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగింది.. ఎందుకు ఇది అంత పెద్ద గొడవలా మారిందనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Watch Video: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. లిఫ్ట్‌లో అవి తీసుకురావొద్దన్నందుకు..
Mumbai Lift Dispute

Edited By: Anand T

Updated on: Nov 09, 2025 | 11:24 AM

మహారాష్ట్ర-ముంబైలోని మాల్వణీ ప్రాంతంలో లిఫ్ట్ వినియోగం విషయంలో ప్రారంభమైన చిన్న గొడవ పెద్ద ఘర్షణగా మారింది. స్థానికంగా 25 ఏళ్లుగా నివసిస్తున్న అశ్విన్ రాజ్‌పుత్ కుటుంబం ఈ దాడికి గురైంది. నివాస సముదాయంలోని 7వ అంతస్తులో కొత్తగా అద్దెకు దిగిన ఓ కుటుంబం లిఫ్ట్ వాడే విషయంలో అశ్విన్ కుటుంబంతో వాగ్వాదానికి దిగింది. ఆపై అది ఉద్రిక్తంగా మారి ఆ యువకులు అశ్విన్ కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడం వరకు చేరింది. బాధిత కుటుంబానికి చెందిన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు అసలు నిజాలు బయటపెట్టింది.

మేము కేవలం లిఫ్ట్ అందరిది కదా.. ఇది చిన్నది కాబట్టి పెద్ద సామాను తీసుకెళ్లొద్దన్నాం.. దానికే వాళ్లు మాపై దాడికి దిగారు. చాలా దారుణంగా మమ్మల్ని కొట్టారు. ఒక ఇంట్లో సాధారణంగా ఉండే విషయాలకే ఇంత రాద్ధాంతం చేయడం చాలా దారుణం.. మాపై దాడికి క్షమాపణ చెప్పాలి. వెంటనే వాళ్లు ఇంటిని ఖాళీ చేయాలని కోరుతున్నాం” అని కంటతడి పెట్టుకున్నారు.

సమాచారం అందుకున్న మాల్వణీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని. .సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా జమాల్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు. అయితే బాధిత కుటుంబం ఇక్కడ చెబుతున్న మరో విషయం ఏంటంటే.. అక్కడ ఉండాలంటే భయం వేస్తోందని.. పిల్లలను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వారు మళ్లీ ఏదైనా దాడి చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దయచేసి వాళ్లు ఇంటిని ఖాళీ చేసి వెళ్తేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు పూర్తి వివరాలు తీసుకుని రెండు కుటుంబాల మధ్య విచారణకు సిద్ధమయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.