
న్యూఢిల్లీ, మే 13: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (33) కన్నుమూశారు. బుధవారం (మే 13)తెల్లవారు జామున 6.15 గంటలకు లక్నో సివిల్ ఆస్పత్రికి ఆయనను తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు ప్రతీక్ యాదవ్ సవతి సోదరుడు. ప్రతీక్ యాదవ్ రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ ఫిట్‌నెస్ పట్ల అమితమైన ఆసక్తి కనబరిచేవారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అయితే ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ మాత్రం బీజేపీలో చేరి, ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మలయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ 2022 అక్టోబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయం తెల్లవారు జామున ప్రతీక్ యాదవ్‌కు అత్యవసర వైద్య సహాయం అందించాలని అతని డ్రైవర్ ఆసుపత్రికి రావడంతో.. ఆస్పత్రి నుంచి ఓ వైద్యుడు అతని నివాసానికి పంపినట్లు లక్నో సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవేష్ చంద్ర పాండే తెలిపారు. అయితే ప్రతీక్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆయన మరణించారని, మరణానికి గల కారణాన్ని గుర్తించేందుకు ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు డాక్టర్ పాండే ధృవీకరించారు.
VIDEO | Uttar Pradesh Congress chief Ajay Rai said, “Prateek Yadav’s death is a very sad incident. A high-level probe should be conducted.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/GGvoYyYCvO
— Press Trust of India (@PTI_News) May 13, 2026
కాగా ప్రతీక్ యాదవ్.. బ్రిటన్‌లోని లీడ్స్ వర్సిటీలో ఎంబీఏ చదివారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ప్రతీక్ ఫిట్‌నెస్‌పై అమితాసక్తి కనబరిచే వారు. 2012 సెప్టెంబర్‌లో బాడీబిల్డింగ్‌కు చెందిన అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో కనిపించారు. 2017లో లాంబోర్గిని కారు కొన్న కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతీక్ యాదవ్ చాన్నాళ్ల నుంచి శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టింది. దీంతో చాలా కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ప్రతీక్‌కు ఆయన భార్య అపర్ణకు కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందని ప్రతీక్ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పలువురు నేతలు ఆయన మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
VIDEO | Prateek Yadav’s death: Aparna Yadav reaches residence in Lucknow.
Prateek Yadav, younger son of late Samajwadi Party founder Mulayam Singh Yadav and a stepbrother of SP chief Akhilesh Yadav, died under mysterious circumstances at 38. Prateek was taken to the Civil… pic.twitter.com/gBKsldhO0a
— Press Trust of India (@PTI_News) May 13, 2026
VIDEO | Lucknow, UP: On the demise of Samajwadi Party MP Akhilesh Yadav’s brother and BJP leader Aparna Yadav’s husband Prateek Yadav, Dr Devesh Chandra Pandey, Chief Medical Superintendent of Lucknow’s Civil Hospital, says, “He was probably unwell which is why was brought here… pic.twitter.com/Eh0dycgMSt
— Press Trust of India (@PTI_News) May 13, 2026
ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య మాలతి దేవి. అఖిలేశ్ యాదవ్ జన్మించిన తర్వాత మాలతీ దేవి ఆరోగ్యం క్షీణించి 2003 మేలో మరణించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2003లో సాధనను ములాయం సింగ్ యాదవ్ రెండో వివాహం చేసుకున్నారు. సాధనకు కూడా ఇది రెండో పెళ్లి. ఆమె 1987లో చంద్ర ప్రకాశ్ గుప్తా అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ప్రతీక్ గుప్తా జన్మించారు. ప్రతీక్ పుట్టిన ఏడాది తర్వాత సాధన తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. వీరికి1990లో విడాకులు మంజూరీ అయ్యాయి. 2022 జులైలో సాధన మృతిచెందింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.