బాబ్రీ మసీదు – రామజన్మ భూమి స్థలాన్ని తనకు అప్పగిస్తే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మొదటి ఇటుకను తానే ఇస్తానని, అది కూడా బంగారు ఇటుకను ఇస్తానని చెప్పారు యాకుబ్ హబీబుద్దిన్ టూసీ. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ వారుసుడైన యాకుబ్ హబీబుద్దిన్ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.
1529లో బాబ్రీ మసీదును బాబరే కట్టించారని అన్నారు హబీబుద్దిన్..ఆ స్థలం బాబర్ ఆస్తి అని తేలితే, అక్కడ ఆలయం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తన పేరును కూడా చేర్చాలని టూసీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది ఇంకా విచారణకు రాలేదు. సుప్రీం కోర్టు కనుక భూమిని తనకు అప్పగిస్తే..ఆలయ నిర్మాణానికి మొత్తం భూమిని ఇవ్వాలని ఇప్పటికే నిర్ణియించినట్లు టూసీ తెలిపారు.
ఇప్పటికే మూడుసార్లు అయోధ్యను సందర్శించి అక్కడ ఇఆలయంలో ప్రార్థనలు చేసిన టూసీ.. గతేడాది ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆలయ నిర్మాణానికి భూమిని అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాము అయోధ్య ప్రజలతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి, రామాలయంల శంకుస్థాపనకు తాను వస్తానని యాకూబ్ చెప్పారు.