MP CM Shivraj: వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం

|

Nov 14, 2021 | 2:55 PM

MP CM Shivraj Chouhan: ఆవు పాలు అమ్మపాలతో సమానం అయితే.. ఆవు పేడ, పంచకం  సహజమైన ఎరువులుగా ఉపయోగిస్తారు. రోజు రోజుకీ ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శద్ధతో మళ్ళీ..

MP CM Shivraj: వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం
Mp Cow Shiva Raj
Follow us on

MP CM Shivraj Chouhan: ఆవు పాలు అమ్మపాలతో సమానం అయితే.. ఆవు పేడ, పంచకం  సహజమైన ఎరువులుగా ఉపయోగిస్తారు. రోజు రోజుకీ ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శద్ధతో మళ్ళీ పూర్వకాలం అలవాట్లవైపు భారతీయులు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సంచలన ప్రకటన చేశారు. ఆవు పేడతో ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆవు పేడను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అంతేకాదు పశుసంరక్షణ, వైద్య చికిత్సను సులభతరం చేయడానికి ‘109’ హెల్ప్‌లైన్ నంబర్‌తో [ప్రత్యేక అంబులెన్స్ సేవను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ‘ఇండియన్‌ వెటిరినరీ అసోసియేషన్‌’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆవు పేడను కొనుగోలు చేయడం..  దాని నుండి ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేసే దిశలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆవు పేడ, మూత్రంతో ఎరువులు, పురుగుమందులు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయొచ్చని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. ఇలా మహిళలు పని కల్పించే దిశగా అడుగులు వేస్తే.. గోవులు, వాటి పేడ, మూత్రం వల్ల కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ శ్మశానాల్లో పిడకలను వినియోగిస్తున్నారని గుర్తు చేశారు

ఒక్కోసారి ఆవులు, గేదెలు, ఎద్దులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, ‘108’ (పౌరులకు అంబులెన్స్ సర్వీస్) మాదిరిగా జంతువుల కోసం ‘109’ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ఒకొక్కసారి జంతువులను చికిత్స ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడితే.. అది చాలా కష్టమైన పని అని.. అటువంటి సమయంలో జంతువులకు చికిత్స చేయడానికి వెటర్నరీ డాక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని, సంరక్షణా కేంద్రాలను నెలకొల్పిందని పేర్కొన్నారు.  అయితే ప్రభుతం ఏ కార్యక్రమం చేపట్టినా.. దానికి ప్రజల భాగస్వామ్యం  ఉండాలని.. లేదంటే అవి మనుగడ సాగించలేవన్నారు.

Also Read:

నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు దుర్మరణం