Floods: వణికిస్తున్న వరద.. సర్వం కోల్పోయిన 500కుటుంబాలు.. రైల్వే ట్రాక్ లపై ఆశ్రయం

|

May 21, 2022 | 11:10 AM

అసోం, బిహార్(Bihar) ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అసోం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో దాదాపు...

Floods: వణికిస్తున్న వరద.. సర్వం కోల్పోయిన 500కుటుంబాలు.. రైల్వే ట్రాక్ లపై ఆశ్రయం
Assam Floods
Follow us on

అసోం, బిహార్(Bihar) ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అసోం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో దాదాపు 8లక్షల మందికి పైగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జమునాముఖ్‌(Jamunamukh) జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్‌ గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఆ గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. 500లకు పైగా కుటుంబాలు ఆశ్రయం కోల్పోయి రైల్వే ట్రాక్‌లపై బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. రైల్వే ట్రాక్‌ కాస్త ఎత్తులో ఉండటంతో అది వరద నీటిలో మునిగిపోలేదు. దీంతో ఈ గ్రామాలకు చెందిన కుటుంబాలు టార్పలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. తినడానికి తిండి కూడా దొరకట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సాయం అందట్లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. జల విలయంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రైల్వే ట్రాక్‌లు కూడా నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బిహార్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. వరదల ఘటనలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మరోవైపు.. ఢిల్లీలోనూ నిన్న సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 11 విమనాలను లఖ్‌నవూ, జైపుర్‌కు దారిమళ్లించారు. ఇందులో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రయాణించిన విమానం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి

Aam Aadmi Party: ఢిల్లీ – పంజాబ్ మోడల్‌.. కేరళలో అరవింద్ కేజ్రీవాల్ పాచికలు పారుతాయా..?

Sri Lanka: పాఠశాలలు, ఆఫీసులు మూసివేత.. ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక