కోవిడ్-19 అదుపులో మోదీ ప్రభుత్వం ఫెయిల్, పాకిస్తాన్ ‘పాస్’, శశిథరూర్

| Edited By: Anil kumar poka

Oct 18, 2020 | 12:35 PM

దేశంలో కోవిడ్-19 అదుపులో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆరోపించారు. అయితే ఇదే సమయంలో దీన్ని కంట్రోల్ చేయడంలో ఇండియా కన్నా పాకిస్తాన్ మెరుగ్గా కృషి చేసిందన్నారు.

కోవిడ్-19 అదుపులో మోదీ ప్రభుత్వం ఫెయిల్, పాకిస్తాన్ పాస్, శశిథరూర్
Follow us on

దేశంలో కోవిడ్-19 అదుపులో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆరోపించారు. అయితే ఇదే సమయంలో దీన్ని కంట్రోల్ చేయడంలో ఇండియా కన్నా పాకిస్తాన్ మెరుగ్గా కృషి చేసిందన్నారు. లాహోర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా వర్చ్యువల్ గా  మాట్లాడిన ఆయన..కరోనా వైరస్ ను సీరియస్ గా పరిగణించాలని, ఇది మన ఎకానమీపై  తీవ్ర ప్రభావం చూపుతుందని తమ పార్టీ నేత రాహుల్ గాంధీ గత ఫిబ్రవరిలోనే హెచ్ఛరించారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాగా-ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు 75 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 61,871 కేసులు నమోదయ్యాయి.  వ్యాక్సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశం ఆశగా ఎదురుచూస్తోంది.