ఇస్రో శాస్త్రవేత్తలకు షాకిచ్చిన కేంద్రం.. ఇంక్రిమెంట్లలో కోత

| Edited By:

Sep 11, 2019 | 3:00 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ పరాజయం అవ్వలేదు. అలాగని ఇంకా విజయవంతం అవ్వలేదు. విక్రమ్ ల్యాండర్‌ సేఫ్‌గా ఉందని ఆర్బిటర్ పంపిన చిత్రాల్లో తేలగా.. దాంతో కమ్యునికేట్ అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయిన తరువాత ప్రతి ఒక్క భారతీయుడు శాస్త్రవేత్తలకు తమ మద్దతును పలికారు. మీ వెంట మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక […]

ఇస్రో శాస్త్రవేత్తలకు షాకిచ్చిన కేంద్రం.. ఇంక్రిమెంట్లలో కోత
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ పరాజయం అవ్వలేదు. అలాగని ఇంకా విజయవంతం అవ్వలేదు. విక్రమ్ ల్యాండర్‌ సేఫ్‌గా ఉందని ఆర్బిటర్ పంపిన చిత్రాల్లో తేలగా.. దాంతో కమ్యునికేట్ అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయిన తరువాత ప్రతి ఒక్క భారతీయుడు శాస్త్రవేత్తలకు తమ మద్దతును పలికారు. మీ వెంట మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ సైతం శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్విస్తున్నాం అని ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఇదిలా ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్ ఇచ్చేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది.

అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ సభ్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ఇంక్రిమెంట్లలో కోత విధించింది. అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జీతంలో కోత పడుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జూన్ 12న విడుదల చేయగా.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో 90శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గనున్నాయి. కాగా 1996లో కేంద్ర ప్రభుత్వం ఎస్‌డీ స్థాయి నుంచి ఎస్‌జీ స్థాయి ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. దాన్ని మోదీ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఈ చర్యను ఇస్రోలోని స్పేస్ ఇంజనీర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, వేతనాల్లో కోతలు లేకుండా చూడాలని వారు ఇస్రో చైర్మన్ కె.శివన్‌ను కోరారు.