మానవాళికి అత్యంత ప్రమాదకరం.. 100కు పైగా మందులపై నిషేధం విధించిన కేంద్రం!

|

Aug 23, 2024 | 3:53 PM

జ్వరం, జలుబు, ఎలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 100కు పైగా FDC మందులు అంటే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

మానవాళికి అత్యంత ప్రమాదకరం.. 100కు పైగా మందులపై నిషేధం విధించిన కేంద్రం!
Fixed Dose Combination Drugs Ban
Follow us on

జ్వరం, జలుబు, ఎలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 100కు పైగా FDC మందులు అంటే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ మందులు మనుషులకు ప్రమాదకరమని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని తెలిపింది.

FDC మందులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 12న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ టాప్ ఫార్మా కంపెనీలకు చెందిన మందులు కూడా ఉన్నాయి. నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే, Aceclofenac 50 mg + Paracetamol 125 mg టాబ్లెట్ నిషేధించిన మందుల జాబితాలో ఉన్నాయి. అలాగే,మెఫెనామిక్ యాసిడ్+ పారాసెటమాల్ ఇంజెక్షన్, సెటిరిజైన్ హెచ్‌సిఎల్+ పారాసెటమాల్+ఫెనైల్ఫ్రైన్ హెచ్‌సిఎల్, లెవోసెటిరిజైన్+ ఫినైల్ఫ్రైన్ హెచ్‌సిఎల్+ పారాసెటమాల్+ క్లోర్‌ఫెనిరమైన్ మలేట్+ ఫినైల్ ప్రొఫెనోలమైన్ మరియు కెమిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25 మి.గ్రా+ పారాసెటమాల్ 30 మి.గ్రా. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ మెడిసిన్స్‌ వాడకం మనుషులకు చాలా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇవి శరీరానికి అనేక రకాల హానిని కలిగిస్తున్నట్లు పేర్కొంది.

విచారణ చేపట్టిన డీటీఏబీ

ప్యానెల్ డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) ఈ FDCల పరిశోధనను సిఫార్సు చేసింది. FDC మానవులకు చాలా ప్రమాదకరమైనది. అందువల్ల, దాని అమ్మకం లేదా పంపిణీ నియంత్రించడం ముఖ్యం. గత సంవత్సరం, జూన్ 2023లో, 14 FDC మందులను నిషేధించింది కేంద్రం. దాదాపు ప్రస్తుతం 344 ఔషధ కలయికలలో FDC ఉన్నట్లు సమాచారం. 2016లో 344 మందుల పంపిణీ, విక్రయాలపై నిషేధం విధించారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రకారం, శాస్త్రీయ డేటా లేకుండా రోగులకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది.

గమనిక: వార్తల్లో ఇచ్చిన కొన్ని సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..