రేపటి నుంచి మళ్ళీ విధుల్లోకి కేంద్ర మంత్రులు

ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యులు  సోమవారం నుంచి తిరిగి విధులకు హాజరు కానున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా అందరూ మళ్ళీ తమ కార్యాలయాలకు వెళ్లి విధుల్లో చేరుతారని తెలుస్తోంది.

  • Umakanth Rao
  • Publish Date - 10:44 am, Sun, 12 April 20
రేపటి నుంచి మళ్ళీ విధుల్లోకి కేంద్ర మంత్రులు

ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యులు  సోమవారం నుంచి తిరిగి విధులకు హాజరు కానున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా అందరూ మళ్ళీ తమ కార్యాలయాలకు వెళ్లి విధుల్లో చేరుతారని తెలుస్తోంది. లాక్ డౌన్ ముగింపునకు ఒక రోజు ముందు ఈ మంత్రులు తమతమ డ్యూటీలకు వెళ్లడంతో తిరిగి వీరి కార్యాలయాలు కళకళలాడనున్నాయి. జాయింట్ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులు కూడా తిరిగి ఆఫీసులకువెళ్తారని, జూనియర్ అధికారులు రొటేషన్ పధ్దతిపై పని చేస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతర పరిస్థితిని బేరీజు వేసి ఎకానమీని పునరుధ్ధరించేందుకు పథకాలు రూపొందించాలని ప్రధాని మోదీ సిబ్బందిని ఆదేశించారు. అయితే సామాజిక దూరాన్ని పాటించాలన్న ప్రోటోకాల్ ని విస్మరించరాదని ప్రభుత్వం సూచించింది. అటు-రెండు వారాల లాక్ డౌన్ పొడిగింపు ఉన్నప్పటికీ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలిసింది. వ్యవసాయోత్పత్తులు , కూరగాయల అమ్మకాలకు అనువుగా చట్టాలను మాడిపై చేయవచ్చు. అలాగే నిర్మాణ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించవచ్చు.