Mewaram Jain’s Videos Leak: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజస్థాన్ బార్మర్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన రెండు వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మేవారం జైన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టగా, ఆ వీడియో అదే కేసుకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఆ మహిళ మేవారం జైన్‌తో పాటు మరో ఎనిమిది మందిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరుణంలో వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రాజకీయ దుమారం మొదలైంది.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మేవారం జైన్ సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ డిసెంబర్ లో పోలీసులను సంప్రదించింది. ఐదేళ్ల కిందట తన తండ్రి అనారోగ్యం బారినపడటంతో బార్మర్‌కు చెందిన రామ్ స్వరూప్‌ను కలిసినట్లు మహిళ తెలిపింది. ఆయన లైంగిక దాడికి పాల్పడటంతోపాటు దానిని రికార్డ్ చేశాడని ఆరోపించింది.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సహా.. పలువురు వేధించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఆ మహిళ తన ఎఫ్‌ఐఆర్‌లో వీడియోలను కూడా ప్రస్తావించింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని, మేవరం జైన్ తన కుమార్తె ఎదుటే తనను వేధించాడని ఆరోపించింది.
This man Mewaram is the Jeffery Epstein of Congress
Congress is a party of sleaze bags & sexual predators
From Bhanwari Devi to Mewaram
From their IYC chief to tandoor kaand
From Shanti Dhariwal to Nitish Kumar statements which were defended by INCToday
Will Priyanka… pic.twitter.com/nt7ucWjURf
— Shehzad Jai Hind (@Shehzad_Ind) January 6, 2024
అయితే, ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియోను పంచుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడటంతోపాటు.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు ప్రశ్నలు సంధించారు. మేవారం బాధితులను పరామర్శిస్తారా అంటూ ప్రియాంక గాంధీని ప్రశ్నించారు. దీనిపై ఫాక్ట్ చెక్ చేస్తారా అంటూ పలువురిని డిమాండ్ చేశారు.
This is ex Congress MLA Mewaram jain. Imagine the plight of girls during congress congress tenure who has leaders like mewaram jain and rahul gandhi. pic.twitter.com/NXafDyILLd
— Ankit Jain (@indiantweeter) January 5, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..