ప్రధాని మోదీతో సమావేశానికి 8 పార్టీలకు ఆహ్వానం…….మెహబూబ్ ముప్తీ బదులు ఫరూక్ అబ్దుల్లా హాజరు

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని 8 పార్టీలకు ఆహ్వానం అందింది. తనకు లాంఛనంగా కాల్ అందినప్పటికీ..

ప్రధాని మోదీతో సమావేశానికి 8 పార్టీలకు ఆహ్వానం.......మెహబూబ్ ముప్తీ బదులు ఫరూక్ అబ్దుల్లా హాజరు
Narendra Modi

Edited By:

Updated on: Jun 20, 2021 | 12:39 PM

జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని 8 పార్టీలకు ఆహ్వానం అందింది. తనకు లాంఛనంగా కాల్ అందినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని, తన బదులు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఈ మీటింగ్ లో పాల్గొంటారని మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముప్తీ తెలిపారు. అయినా తమ పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు. 8 పార్టీల నుంచి 16 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదివరకటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చివరి సీఎం అయిన మెహబూబా ముప్తీ 2016 నుంచి 2018 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. ఢిల్లీలో ప్రధానితో జరిగే సమావేశానికి హాజరయ్యే విషయమై తమలో తాము చర్చించుకుంటామని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వెల్లడించారు. ఇక బీజేపీతో బాటు జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ తాము హాజరవుతామని ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు గల అవకాశాలపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

సుమారు రెండేళ్ల క్రితం.. కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసి.. దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో అప్పట్లో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పర్యవసానంగా ప్రభుత్వం ప్రధాన పార్టీల నాయకులకు గృహ నిర్బంధం విధించింది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీ వంటి అనేకమంది గృహ నిర్బంధంలో ఉంటూ వచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

Loading...
Unable to load recommendations.
Follow Us