Maternity Leave: ఇక నుంచి అక్కడ UG-PG బాలికలకు ప్రసూతి సెలవులు.. అది స్త్రీ హక్కు అంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య

|

Dec 18, 2021 | 1:08 PM

Maternity Leave: ఇప్పటి వరకూ ఉద్యోగినులకు మాత్రమే ఉన్న ప్రసూతి సెలవులు ఇక నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో పాటు  ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న అండర్..

Maternity Leave: ఇక నుంచి అక్కడ UG-PG బాలికలకు ప్రసూతి సెలవులు.. అది స్త్రీ హక్కు అంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య
Maternity Leave
Follow us on

Maternity Leave: ఇప్పటి వరకూ ఉద్యోగినులకు మాత్రమే ఉన్న ప్రసూతి సెలవులు ఇక నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో పాటు  ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్  విద్యార్థినిలకు కూడా ప్రసూతి సెలవుల లభించనున్నాయి. ప్రసూతి సెలవులకు సంబంధించిన అంశంపై వివిధ న్యాయస్థానాలు నిర్ణయించిన చట్టం ప్రకారం బిడ్డకు జన్మనివ్వడం మహిళ ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ హక్కు ప్రతికి చెందుతుందని దానిని తిరస్కరించలేమని చెప్పింది.

లక్నోలోని APJ అబ్దుల్ కలాం విశ్వవిద్యాలయం UGలోని బాలికలకు ప్రసూతి సెలవులకు సంబంధించి నిబంధనలను రూపొందించనందుకు హైకోర్టు ఖండించింది. అంతేకాదు త్వరలోనే ప్రసూతి సెలవుల నిబంధనలు రూపొందించాలని  విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. యూజీ లేదా ఉన్నత చదువులు చదువుతున్న బాలికలు బిడ్డకు జన్మనిచ్చే ముందు  లేదా తర్వాత ప్రసూతి సెలవులను అందించేలా చట్టబద్ధమైన నియమాలను విశ్వవిద్యాలయం రూపొందించాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతేకాదు పరీక్ష సమయంలో విద్యార్థిని మాతృత్వం పొందితే.. అప్పుడు యూనివర్సిటీలో పరీక్షలు జరుగుతుంటే.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థినికి అదనపు అవకాశం కల్పించాలని హెకోర్టు పేర్కొంది. ప్రసూతి సెలవులకు సంబంధించి నిబంధనలను రూపొందించడానికి AKTUకి అలహాబాద్ హైకోర్టు నాలుగు నెలల గడువు ఇచ్చింది.

ఉన్నత విద్య చదువుతున్న స్టూడెంట్స్ కు ప్రసూతి సెలవులు కావాలంటూ 2013 బ్యాచ్‌కి చెందిన ఓ విద్యార్థిని కోర్టు గడపలోకి అడుగు పెట్టిన తెలిసిందే.. ఈ కేసు కాన్పూర్‌లోని కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  2013 బ్యాచ్‌కి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని సౌమ్య తివారీకి సంబంధించినది. సౌమ్య B.Tech  స్టూడెంట్. అన్ని సెమిస్టర్‌లను పాస్ అయింది. అయితే సౌమ్య గర్భం దాల్చి, ప్రసవం తర్వాత కోలుకోవడానికి సమయం పట్టడంతో.. రెండో సెమిస్టర్ పరీక్షలతో పాటు.. మూడో సెమిస్టర్ లోని ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ రెండో పేపర్ కు హాజరు కాలేకపోయింది.

డెలివరీ సమయం కావడంతో సెకండ్, థర్డ్ సెమిస్టర్స్ పరీక్షలను సౌమ్య మిస్ అయింది. దీంతో తాను మిస్ అయిన పరీక్షలను మళ్ళీ రాసేందుకు అవకాశం ఇవ్వమని సౌమ్య యూనివర్సిటీ అధికారులు కోరింది. అయినప్పటికీ సౌమ్య అభ్యర్ధనని ఏకేటీయూ అంగీకరించలేదు. దీంతో సౌమ్య తివారీ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read:  స్మార్ట్ ఫోన్ మిస్ అయిందని ఆత్మహత్య చేసుకున్న మహిళ.. ఎక్కడంటే..