జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. రెండు, మూడు అంతస్తుల్లో ఎగిసి పడుతున్న మంటలు..

చెన్నైలోని అన్నానగర్‌లోని జీఎస్టీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో జరిగిన నష్టం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. రెండు, మూడు అంతస్తుల్లో ఎగిసి పడుతున్న మంటలు..
Fire At Gst Office

Updated on: Dec 07, 2025 | 12:47 PM

చెన్నైలోని అన్నానగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అన్నానగర్‌లో గల జీఎస్టీ ఆఫీస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. GST కమిషనరేట్ చెన్నైలోని అన్నానగర్ 12వ ప్రధాన రోడ్డులో ఉంది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌లోని క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. మంటలు రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్లు, 60 మంది సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో లాజిస్టిక్స్, ముఖ్యమైన పత్రాలు, క్యాంటీన్‌లోని పాత్రలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మంటల్లో కాలిపోయినట్టుగా తెలిసింది. విద్యుత్ షార్ట్‌ సర్కూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ అధికారులు కూడా సందర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..