Trump Indian Markets: ‘నేను గెలిచానంటే.. మీ మార్కెట్లు జిగేల్.. లేదా… ఢమాల్’ ! ట్రంప్

|

Feb 25, 2020 | 6:36 PM

అమెరికా అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఇండియన్ మార్కెట్లు లక్షలాది పాయింట్లు పెరిగిపోయి కళకళలాడడం ఖాయమని అన్నారు డోనాల్డ్ ట్రంప్.. కానీ తను ఓడిపోతే మాత్రం మీ మార్కెట్లన్నీ ఎన్నడూ లేనివిధంగా కుప్పకూలిపోవడం కూడా తథ్యమే అని హెచ్ఛరించారు.

Trump Indian Markets: నేను గెలిచానంటే.. మీ మార్కెట్లు జిగేల్.. లేదా... ఢమాల్ ! ట్రంప్
Follow us on

అమెరికా అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఇండియన్ మార్కెట్లు లక్షలాది పాయింట్లు పెరిగిపోయి కళకళలాడడం ఖాయమని అన్నారు డోనాల్డ్ ట్రంప్.. కానీ తను ఓడిపోతే మాత్రం మీ మార్కెట్లన్నీ ఎన్నడూ లేనివిధంగా కుప్పకూలిపోవడం కూడా తథ్యమే అని హెచ్ఛరించారు. మంగళవారం ఢిల్లీలో భారత పారిశ్రామిక దిగ్గజాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. తమ దేశంలో మీరంతా పెట్టుబడులు పెడుతున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ‘థ్యాంక్యూ..యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్’ అని ప్రశంసించారు కూడా. విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలో ఆర్ధిక ఆంక్షలను సడలిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. కొన్ని నిబంధనలు చట్టబధ్ధమైనవి కావచ్ఛునని, అయితే ప్రభుత్వం వీటిలో చాలావాటిని సరళీకరించేందుకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.  ఈ ఏడాది నవంబరులో  అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.