Varanasi: తాంత్రికుడు చెప్పిన మాట విన్నాడు.. దీపావళి రోజున స్కెచ్ వేశాడు.. చివరకు..

|

Nov 05, 2024 | 9:02 PM

ఓ వ్యక్తి తన 8 మంది కుటుంబ సభ్యులను హత్యలు చేశాడు. ఈ ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసిలో మద్యం వ్యాపారి రాజేంద్ర గుప్తా 28 ఏళ్లలో తన కుటుంబంలోనే 8 హత్యలు చేశాడు. తన తండ్రి, సోదరుడు, భార్య, కొడుకులు, కూతుళ్లిద్దరినీ హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత గుప్తా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందుకు ఇలా చేశాడు?

Varanasi: తాంత్రికుడు చెప్పిన మాట విన్నాడు.. దీపావళి రోజున స్కెచ్ వేశాడు.. చివరకు..
Varanasi Incident
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అక్రమ మద్యం వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యాపారవేత్త రాజేంద్ర గుప్తా తన సొంత కుటుంబ సభ్యులను బలితీసుకున్నాడు. ఇతడు చేస్తున్న ఈ వ్యాపారంపై అతని భార్య 28 ఏళ్ల క్రితం నిరసన వ్యక్తం చేసింది. ఆ సమయంలో పెద్ద గొడవ జరగడంతో భార్య అతడిని వదిలేసింది. దీని తర్వాత రాజేంద్ర గుప్తా తండ్రి, సోదరుడుల మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో రాజేంద్ర గుప్తా  తన తండ్రని హత్య చేశాడు. అతనిని రక్షించడానికి సొదరుడు, సోదరుడి భార్య ముందుకు రావడంతో, రాజేంద్ర గుప్తా వారిని కూడా కాల్చాడు.

ఈ ఘటన తర్వాత వారణాసి పోలీసులు రాజేంద్ర గుప్తాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలుకు వెళ్లాక అతని వ్యాపారం కుప్పకూలింది. ఈ ఘటనకు రాజేంద్ర గుప్తా తల్లి ప్రత్యక్ష సాక్షి. అయితే ఆమె కోర్టులో వాంగ్మూలం ఇవ్వలేకపోయింది. సాక్ష్యాలు లేకపోవడంతో, గుప్తా బెయిల్‌కు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను జైలు నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మద్యం వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పుటి నుంచి అతని వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. గుప్తాకు బనారస్‌లోనే నాలుగు ఇళ్లు ఉన్నాయి. అతని కుటుంబం ఒక్క భవనంలో నివాసం ఉంటే, మిగిలిన మూడు ఇళ్ళు అద్దెకు ఇచ్చేవాడు.  దీంతో ప్రతి నెలా దాదాపు రూ.3 నుంచి 4 లక్షల ఆదాయం వచ్చేది. ఇది కాకుండా, రాజేంద్ర గుప్తాకు మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్లు కూడా వెల్లడైంది. రాజేంద్ర గుప్తా ఈ మహిళను వివాహం చేసుకోవాలనుకున్నట్లు, అయితే దానికి అతని భార్య ఒప్పుకొలేదని పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ కారణంతో రాజేంద్ర గుప్తా తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక సంవత్సరం ఒంటరిగా ఉన్నాడు. రాజేంద్ర గుప్తా అక్రమ మద్యం వ్యాపారం సాగలేదు. పోలీసుల దాడులు నిర్వహించి చాలా అక్రమ మద్యంను సీజ్ చేశారు. ఇక అటువంటి అటువంటి పరిస్థితిలో గుప్తా బనారస్‌లోని ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. ఇందులో తాంత్రికుడు తన వ్యాపారానికి తన భార్య అడ్డుగా ఉందని చెప్పాడు. తాంత్రికుడి సలహా మేరకు, రాజేంద్ర గుప్తా పథకం ప్రకారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుని అవకాశం చూసి భార్యను, కొడుకులు, కూతురు ఇద్దరినీ హతమార్చాడు.