Mundka Fire: 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు.. ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో కీలకంగా మారిన క్రేన్ డ్రైవర్..

|

May 15, 2022 | 7:08 PM

Mundka Fire: ఢిల్లీ ముండ్కా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం కొంత ఆలస్యమైంది. కానీ..

Mundka Fire: 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు.. ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో కీలకంగా మారిన క్రేన్ డ్రైవర్..
Mundka Fire
Follow us on

Mundka Fire: ఢిల్లీ ముండ్కా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం కొంత ఆలస్యమైంది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక క్రేన్ డ్రైవర్ సుమారు 50 మందికి పైగా వ్యక్తుల ప్రాణాలు కాపాడాడు. వారికి రక్షకుడిగా నిలిచాడు. భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడుతున్న సమయంలో ఎక్కువ సంఖ్యలో అందులోని మహిళలను కాపాడాడు.

ఔటర్ ఢిల్లీ ముండ్కాలోని కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో  27 మంది మరణించారు. మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉన్నారు. దయానంద్ తివారీ అనే డ్రైవర్ తాను నడుపుతున్న క్రేన్ యజమానితో కలిసి అగ్ని ప్రమాదం జరుగుతున్న మార్గంలో ఉన్న భవనాన్ని దాటాడు. ఆ సమయానికి అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో తన వంతు సాయం అందించేందుకు రంగంలోకి దిగి.. క్రేన్ సహకారంతో సుమారు 50 మందిని ఆ భవనం నుంచి రక్షించాడు. అతను రక్షించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం గమనార్హం. మంటలు మరింత తీవ్రతరం కావటం కారణంగా మిగిలిన వారికి తాము కాపాడలేక పోయినట్లు సదరు డ్రైవర్ తెలిపాడు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో తాను నడుపుతున్న క్రేన్ యజమాని, సహాయకుడు కూడా ఉన్నట్లు తెలిపాడు. ఇది చాలా భయానక దృశ్యమని దయానంద్ తివారీ అభిప్రాయపడ్డాడు.

అయితే ఘటనల జరిగిన భవనంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్‌ఓసీ లేదని పోలీసులు గతంలో చెప్పారు. ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు అదే భవనంలో నివసిస్తున్న బిల్డింగ్ యజమాని కుటుంబం భవనం పై అంతస్తు నుంచి పక్కనే ఉన్న మరో భవనంపైకి చేరుకోవటంతో తప్పించుకున్నారు. కానీ పోలీసులు సదరు యజమానిని ఇప్పుడు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి..

Mukesh Ambani: 6.5 బిలియన్ డాలర్ల వ్యాపారంపై కన్నేసిన ముకేష్ అంబానీ.. విదేశీ కంపెనీలకు ధీటుగా ఏంచేస్తున్నారంటే..

RBI Rules: నగదు లావాదేవీలపై కొత్త నిబంధనలు.. లిమిట్ దాటి ట్రాన్సాక్షన్స్ చేస్తే టాక్స్ అధికారుల వద్ద బుక్కైపోతారు.. జాగ్రత్త..