Brain Tumour: పూర్తి మెలకువగా ఉన్న వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ.. ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానోపై హనుమాన్ చాలీసా పఠించాడు….

|

Nov 04, 2023 | 4:18 PM

28 ఏళ్ల యువకుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భోపాల్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు పరిశీలించగా.. ఆ వ్యక్తికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు తేలింది. అతని వయసు చిన్నది కావడం, మెదడులోని కణితి సామీప్యతను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు అతడు మేల్కొని ఉండగానే మెదడు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శారీరక కదలికలను నియంత్రించే ప్రాంతంలో కణతి ఉండటంతో వైద్యులు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Brain Tumour: పూర్తి మెలకువగా ఉన్న వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ.. ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానోపై హనుమాన్ చాలీసా పఠించాడు....
Brain Tumour
Follow us on

మెలకువగా ఉన్న ఓ వ్యక్తికి వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన ఘటన భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తికి డాక్టర్ బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో రోగి పూర్తిగా మేల్కొనే ఉన్నాడు. ఆయన పియానో ​​వాయిస్తూ హనుమాన్ చాలీసా ఆలపిస్తుండగా వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. అతని మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు మేల్కొని ఉండగానే.. క్రానియోటమీని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో అతడు న్యూస్‌ పేపర్‌ చదువుతున్నాడు. పియానో ​​వాయించిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

బీహార్‌లోని బక్సర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భోపాల్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు పరిశీలించగా.. ఆ వ్యక్తికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు తేలింది. అతని వయసు చిన్నది కావడం, మెదడులోని కణితి సామీప్యతను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు అతడు మేల్కొని ఉండగానే మెదడు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శారీరక కదలికలను నియంత్రించే ప్రాంతంలో కణతి ఉండటంతో వైద్యులు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. మోటార్ ఫంక్షన్ల బలహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి రోగి మేల్కొని ఉండగానే, సర్జరీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే వైద్యుల బృందం ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంలో వ్యక్తి పియానో ​​వాయించాడు. హనుమాన్ చాలీసాను పఠించాడు. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఆపరేషన్‌ సమయంలో అతడి ముఖంలో ఎలాంటి ఒత్తిడి కానీ, ఆందోళన కానీ కనిపించకపోవడం గమనార్హం.

సర్జరీ వీడియోలలో అతడు ఆపరేషన్‌ టేబుల్‌పై పడుకుని ఉండగా, డాక్టర్స్ శస్త్రచికిత్స చేస్తున్నారు.. ఆ సమయంలో అతడు కీబోర్డ్ పియానో ​​వాయించడం డాక్టర్‌ చూపించారు. సర్జన్ తెలిపిన వివరాల ప్రకారం శస్త్రచికిత్స సమయంలో అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు.. ఎందుకంటే డాక్టర్ అనుక్షణం అతనితో మాట్లాడుతూ ఉంటారు.. కాబట్టి ఆ వ్యక్తి హాయిగా న్యూస్ పేపర్ చదువుతున్నాడు. పియానో ​​వాయిస్తూ హనుమాన్ చాలీసా పఠించాడని చెప్పారు. అలా అతడి మెదడు నుంచి కణితిని తొలగించేంత వరకు ఆ వ్యక్తి పియానో ​​వాయిస్తూనే ఉన్నాడని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై సర్జరీ చేసిన టీమ్ డాక్టర్, న్యూరోసర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సుమిత్ రాజ్ మాట్లాడుతూ..అతని మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించామని చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..