
ఆ జంటకు ఇటీవలే పెళ్లయింది. పెళ్లి వేడుక తర్వాత వధూవరులు ఇద్దరు దర్గాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారును అద్దెకు తీసుకుని ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ చిన్న ప్రయాణంలో వధువు కారు డ్రైవర్‌తో ప్రేమలో పడింది. కొద్ది రోజుల్లోనే ఆమె అతనితో పాటు పారిపోయింది. దీంతో వరుడు రగిలిపోయాడు. తనను మోసం చేసిన ఆ యువతిని వెంటాడి చంపాడు. ఈ ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లా అథని తాలూకా కొకటనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
కొకటనూరు గ్రామానికి చెందిన హీనా మెహబూబ్ (19), తౌఫిక్ షౌకత్ (24)లకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత ఇద్దరూ అద్దె కారులో దర్గాకు వెళ్లారు. ఈ సమయంలో కారు డ్రైవర్ యాసిన్ ఆడమ్ (21)తో ప్రేమలో పడింది హీనా. అదే నెలలో హీనా తన భర్తను వదిలి ప్రియుడు యాసిన్‌తో పారిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన తౌఫిక్ షౌకత్‌ను హత్య చేసేందుకు పథకం వేశాడు.
లేచిపోయిన వారిద్దరూ బెళగావి జిల్లా అథని తాలూకా కొకటనూర్ గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. మంగళవారం సాయంత్రం అక్కడికి వెళ్లి యాసిన్, హీనాపై తౌఫిక్ దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేసి వారిద్దర్ని చంపేవాడు. గొడవను అడ్డుకునేందుకు వచ్చిన సద్దుమణిగేందుకు హీనా తల్లిదండ్రులపై కూడా తౌఫిక్ దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులు మహారాష్ట్రలోని మీరజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…