Domino’s pizza: యమ్మీ యమ్మీ పిజ్జా తిందామనుకున్న కస్టమర్‌కి చేదు అనుభవం.. ఒక్క బైట్‌ తినగానే చిర్రెత్తిపోయాడు..

పిజ్జా లో ఏకంగా గాజు ముక్కలు రావడంతో  సదరు కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే ఏదో పొరపాటుగా భావించి..లైట్ తీసుకున్నాడు.

Dominos pizza: యమ్మీ యమ్మీ పిజ్జా తిందామనుకున్న కస్టమర్‌కి చేదు అనుభవం.. ఒక్క బైట్‌ తినగానే చిర్రెత్తిపోయాడు..
Domino's Pizza

Updated on: Oct 10, 2022 | 1:04 PM

డబ్బు ఉంటే చాలు.. ఈరోజుల్లో అంతా ఒక్క చిటికెలో మీ ముంగిట్లోనే దొరుకుతుంది. కానీది, లేనిదీ, సాధ్యపడనిదీ అంటూ ఏదీ లేదు..కానీ అలాంటివి కొన్ని కొన్ని సందర్బాల్లో అంతే ప్రమాదకరంగా కూడా మారుతుంటాయి. ఇటీవల వైరల్ అయిన ట్విట్టర్ పోస్ట్ ఈ ప్రమాదం గురించి హెచ్చరించింది. పిజ్జా లో ఏకంగా గాజు ముక్కలు రావడంతో  సదరు కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే ఏదో పొరపాటుగా భావించి..లైట్ తీసుకున్నాడు. తినడం కంటిన్యూ చేశాడు.. ఇంతలో మరో రెండు గాజు ముక్కలు పంటికి తగిలటంతో అతడు చిర్రేత్తిపోయాడు..వెంటనే దానిని ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు డొమినోస్ ఇండియా, ముంబై పోలీసులు, సంబంధిత ఇతరులను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్‌పై ముంబై పోలీసులు స్పందించారు.

కాగా, జరిగిన విషయంపై ముంబై పోలీసులు స్పందిస్తూ..ఈ విషయాన్ని కస్టమర్ కేర్‌కు తెలియజేయాలని చెప్పారు. వారు మీకు సమాధానం ఇవ్వకుంటే లేదా తగిన విధంగా స్పందించకుంటే, మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చునని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే అరుణ్ కస్టమర్ కేర్ డిపార్ట్ మెంట్ ను సంప్రదించాడు. కాగా, డొమినో ప్రతినిధి అరుణ్‌ను పూణే సంప్రదించి సమగ్ర విచారణ చేపట్టామన్నారు. డొమినోస్ తరఫున కస్టమర్ కు క్షమాపణలు తెలిపారు. కానీ, మా ఫుడ్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, తమ తనిఖీల్లో రెస్టారెంట్లో ఎలాంటి గాజు సామాగ్గ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు. మన వంటగదిలో ప్రతిదీ శుభ్రత మార్గదర్శకాలను అనుసరిస్తుంది. నిబంధనల ప్రకారం అక్కడ గాజు వస్తువులు వాడడం కూడా నిషిద్ధం అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కు సంబంధించి చాలా మంది తమ చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. తన వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని డొమినో చెప్పడంతో.. అరుణ్ చట్టాన్ని ఆశ్రయిస్తాడో లేదో చూడాలి మరీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..