Kumbh Mela In Haridwar : హరిద్వార్ లో గత ఏప్రిల్ లో జరిగిన కుంభ్ మేళా సందర్భంగా ఆర్ టీ =పీసీఆర్ టెస్టుల్లో భారీ కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ పై అధికారులతో కూడిన మూడు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుంభ్ మేళాకు లక్షలమంది భక్తులు, యాత్రికులు హాజరైన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ వ్యాప్తి నివారణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ టెస్టుల నిర్వహణకు 11 ప్రైవేటు కంపెనీలకు అధికారమిచ్చింది. వీటిలో మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్ అనే కంపెనీ ..లాల్ చందానీ ల్యాబ్స్, నల్వా ల్యాబ్స్ అనే రెండు ల్యాబ్ లకు బాధ్యత అప్పజెప్పింది. ఇవి సుమారు లక్ష మందికి ఈ టెస్టులు నిర్వహించినట్టు చెప్పుకున్నాయి. కానీ నిజానికి ఇవి జరగలేదని.. ఇవన్నీ వట్టి పేపర్లమీదే ఉన్నాయని ఆ తరువాత తెలిసింది. అయితే ఆయా భక్తుల ఫోన్ నెంబర్లు మాత్రం ఈ కాగితాల్లో ఉన్నాయి. కానీ దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. ఫలితంగా ఇంతమంది భక్తులు, యాత్రికుల ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. హరిద్వార్ అధికార యంత్రాంగం తో బాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వంకూడా దీన్ని సీరియస్ గా పరిగణించి దీనిపై ఇన్వెస్టిగేషన్ కి అధికారులతో కూడిన మూడు బృందాలను నియమించింది.
ప్రస్తుతం ఈ బృందాలు ఆయా ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు బోగస్ నెంబర్లని కూడా తేలింది. కొన్నింటిని అవతలివారు రిసీవ్ చేసుకోగా చాలా కాల్స్ లో పాలువురు రిసీవ్ చేసుకోలేదని కూడా తెలిసింది. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. కాగా ఈ రెండు ల్యాబ్ లపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.కుంభ్ మేళాకు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యారు. వారి ఫోన్ నెంబర్లలో చాలావరకు స్విచాఫ్ అయిఉన్నట్టు వెల్లడైంది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.