
దేశంలో రోజురోజుకూ వరకట్న వేధింపుల పెరిగి పోతున్నాయి. గత నెలలో నోయిడాలో నిక్కీ భాటి హత్య, రెండు వారాల క్రితం బెంగళూరులో మరో ఇల్లాలు ఆత్మహత్య ఘటనలు మరువక ముందే మహారాష్ట్రలో మరో ఇల్లాలు వరకట్న వేధింపులు తాళలేక పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన మయూరి గౌరవ్ తోసర్ (23) అనే యువతికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే ఆమె అత్తమామలు, నిరంతరం ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవారని, డబ్బు డిమాండ్ చేసేవారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.
నాలుగు నెలల కాలంలో కుటుంబంతో రాజీపడటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, తమ కూతురిపై అత్తింటి వారి వేధింపులు తగ్గలేవని వారు ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే మయూరి తన పుట్టిన రోజు జరిగిన తర్వాత రోజూ ఆత్మహత్యకు పాల్పడిందని వారు చెప్పుకొచ్చారు. తన కూతురి చావుకు కారణమైన ఆమె అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.