Maharashtra To Unlock : అన్ లాక్ బాటలో మహారాష్ట్ర.. సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపులు

సోమవారం నుంచి ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియ‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

Maharashtra To Unlock : అన్ లాక్ బాటలో మహారాష్ట్ర..  సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపులు
Maharashtra To Unlock

Updated on: Jun 05, 2021 | 10:52 PM

Maharashtra To Unlock From Monday : మహారాష్ట్ర సైతం ఢిల్లీ బాటలో పయనిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఆంక్షల నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సోమవారం నుంచి ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియ‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాల్లో మినహాయింపు పరిమితుల‌ను నిర్ణయించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్షించ‌నుంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్‌లాక్ మొద‌టి స్థాయిలో కనీస పరిమితులు ఉండగా, ఐద‌వ స్థాయిలో అధిక‌ పరిమితులతో అన్ లాక్ ప్రక్రియను ఆచరిస్తారు.

ఆయా జిల్లాలో ఐదు శాతం క‌న్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో, లేదా 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ పడకలు ఉన్న ప్రాంతాల్లో మొద‌టి స్థాయి పరిమితులు విధిస్తారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు విక్రయించే దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతినిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. వివాహాలు, అంత్యక్రియల‌కు అనుమ‌తులుంటాయి. లోక‌ల్ రైళ్లు కూడా నడుస్తాయి.

ఇక, రెండు, మూడు, నాలుగు స్థాయిల్లో పాజిటివిటీ రేటు ఆధారంగా సడలింపులు నిర్ణయించారు. ఐద‌వ స్థాయిలో పరిస్థితి ఇంచుమించు లాక్‌డౌన్ మాదిరిగానే ఉంటుంది. నిత్యావ‌స‌ర‌ దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నారు. మాల్స్, షాపింగ్ సెంటర్లు, జిమ్‌లు మూసివేసే వుంచుతారు.

Read also : Delhi Unlocking : దేశ రాజధాని హస్తినలో కరోనా అన్ లాక్ షురూ చేసిన సీఎం కేజ్రీవాల్.. షాపులు, ఆఫీస్‌లకు వెసులుబాట్లు ఇలా..

Follow Us