ప్రియురాలిని ఆటపట్టించాడని భిక్షగాడిని కొట్టి చంపిన మైనర్ యువకుడు..!
మహారాష్ట్రలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగు చూసింది. నాసిక్‌లోని త్ర్యంబక్ నాకా ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు రోడ్డు మీదే ఓ భిక్షగాడిని రాయితో కొట్టి చంపాడు. అంతే కాకుండా హత్య చేసిన తర్వాత శవం పక్కనే నిలబడి డ్యాన్స్ చేశాడు. ఈ భయానక దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మహారాష్ట్రలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగు చూసింది. నాసిక్‌లోని త్ర్యంబక్ నాకా ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు రోడ్డు మీదే ఓ భిక్షగాడిని రాయితో కొట్టి చంపాడు. అంతే కాకుండా హత్య చేసిన తర్వాత శవం పక్కనే నిలబడి డ్యాన్స్ చేశాడు. ఈ భయానక దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులు ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను మానసికంగా స్థిరంగా లేడని పోలీసులు చెబుతున్నప్పటికీ, అతను ఓ పెద్దాయనతో ఉన్న వీడియో బయటకు రావడంతో ఆ అనుమానంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆ మైనర్ తన ప్రేయసితో కలిసి నాసిక్‌లోని ఠక్కర్ మార్కెట్ సమీపంలోని ఓ హోటల్ బయట నిలబడి ఉన్నాడు. అతని ప్రేయసి వాటర్ బాటిల్‌కి వెళ్లిన సమయంలో పక్కనే ఉన్న ఓ భిక్షగాడు ఏదో మాట్లాడటం అతనికి కనిపించింది.
ప్రేయసితో భిక్షగాడు ఏదో చేస్తున్నాడని అనుమానంతో ఆగ్రహానికి గురైన మైనర్, పక్కన ఉన్న పెద్ద రాయి తీసుకుని భిక్షగాడి తలపై బలంగా విసిరాడు. దీంతో తీవ్రంగా గాయపడి భిక్షగాడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భిక్షగాడి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




