హమ్మయ్య..! ఎట్టకేలకు చిక్కిన నరభక్షక పులి.. నలుగురు రైతులను బలితీసుకున్న బెబ్బులికి చెక్!

మహారాష్ట్రలో మనుషులపై దాడులు చేసి నలుగురు రైతుల ప్రాణాలు తీసిన మరో నరభక్షక పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ అటవీ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్న ‘త్రిశూల్’ అనే పులిని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

హమ్మయ్య..! ఎట్టకేలకు చిక్కిన నరభక్షక పులి.. నలుగురు రైతులను బలితీసుకున్న బెబ్బులికి చెక్!
Man Eating Tiger

Updated on: Nov 06, 2026 | 3:33 PM

మహారాష్ట్రలో మనుషులపై దాడులు చేసి నలుగురు రైతుల ప్రాణాలు తీసిన మరో నరభక్షక పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ అటవీ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్న ‘త్రిశూల్’ అనే పులిని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

నలుగురి ప్రాణాలు తీసిన బెబ్బులి

అటవీశాఖ గుర్తింపు ప్రకారం.. ఈ పులి దాడుల్లో సదాశివ ఖడ సంగే, పత్రూ మేశ్రం, రాజేంద్ర భోయర్, శంకర్ మేశ్రం అనే నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ నెల 30వ తేదీన చిమూర్ అటవీ ప్రాంతంలో సదాశివ ఖడ సంగే, సిందేవాహి తాలూకాలో పత్రూ మేశ్రం, జులై 6న నవేగావ్‌లో రాజేంద్ర భోయర్, ఏప్రిల్ 23న వహాన్‌గావ్ పరిసరాల్లో శంకర్ మేశ్రం పులి దాడికి బలయ్యారు.

పక్కా వ్యూహంతో పులి బంధనం

వరుస దాడులతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిమూర్ అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గడగావ్ అటవీ పరిధిలోని ఉరుకుడ్ పార్ గ్రామ శివారులో త్రిశూల్ కదలికలను గుర్తించారు. షూటర్ అజయ్ మరాటే సహాయంతో పులికి మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించారు.

చంద్రపూర్‌కు తరలింపు

పట్టుకున్న పులిని డాక్టర్ రమాకాంత్ కోబ్రాగడే పర్యవేక్షణలో చంద్రపూర్‌కు తరలించినట్లు అటవీశాఖ సీఎఫ్‌ఏ మహేష్ గైక్వాడ్ వెల్లడించారు. వరుసగా మనుషులపై దాడులు చేస్తున్న పులిని పట్టుకోవడంతో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us