Maharashtra: శంభాజీనగర్‌లో రెండు గ్రూపులు ఘర్షణ, రాళ్లతో దాడి, పోలీసు వాహనాలు దగ్ధం

|

Mar 30, 2023 | 8:31 AM

కిరాడ్‌పురా ప్రాంతంలో దుండగులను తరిమికొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. అదే సమయంలో వాహనాల్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడికక్కడే పూర్తి శాంతి నెలకొంది. ఆ ప్రాంతమంతా భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి.

Maharashtra: శంభాజీనగర్‌లో రెండు గ్రూపులు ఘర్షణ, రాళ్లతో దాడి, పోలీసు వాహనాలు దగ్ధం
Police Vehicle Set On Fire
Follow us on

మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లో బుధవారం అర్థరాత్రి ఆలయం వెలుపల రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లను రువ్వుకున్నారు. తోపులాటలు జరిగింది. ఈ ఘటనలో అరడజను మందికి పైగా గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వల్పంగా బల ప్రయోగం చేశారు. ఇరువర్గాల ప్రజలను చెదరగొట్టి శాంతిభద్రతలను కొనసాగించారు. సంభాజీ నగర్‌లోని కిరాద్‌పురా ఆలయం వెలుపల ఈ ఘటన జరిగింది.

సమాచారం ప్రకారం.. ఆలయం వెలుపల ఇద్దరు యువకుల మధ్య పరస్పర వాగ్వాదంతో ఈ గొడవ ప్రారంభమైంది. అనంతరం ఆ  యువకులిద్దరూ వారి వారి వైపుల నుండి ఇతరులను పిలిచారు. ఆ తర్వాత వ్యవహారం హింసగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఇరువర్గాల ప్రజలు తొలుత ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. అనంతరం రాళ్లతో దాడికి దిగారు.

మరోవైపు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు దుండగులు సంఘటనా స్థలంలోని పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో ఒకవైపు నుంచి బాంబులు పేల్చినట్లు చెబుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుంటే.. పోలీసులు బలప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో.. భద్రత కోసం నగరంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిరాడ్‌పురా ప్రాంతంలో దుండగులను తరిమికొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. అదే సమయంలో వాహనాల్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడికక్కడే పూర్తి శాంతి నెలకొంది. ఆ ప్రాంతమంతా భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. మరోవైపు ప్రజలను శాంతింపజేసేందుకు మత పెద్దలను రంగంలోకి దింపారు.

మరోవైపు సమాచారం అందుకున్న స్థానిక ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి ప్రజలతో మాట్లాడి శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టి.. దానిని మతపరమైన చిచ్చుగా మార్చేందుకు కొందరు ప్రయత్నించారని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..