ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్!

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. వారి వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్!
Pm Modi Mumbai Event

Updated on: Sep 08, 2026 | 5:06 PM

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) ప్రాంగణంలో ఈ ఇద్దరిని గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో ఉన్న వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. అతనితో పాటు ఉన్న అంగరక్షకుడి వద్ద తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో గుర్తింపు కార్డు అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా అది నకిలీదని తేలింది.

నకిలీ PMO గుర్తింపు కార్డును ఎలా సంపాదించాడు? తాను PMO అధికారినని ఎందుకు చెప్పుకున్నాడు? తుపాకీతో ఉన్న బాడీగార్డుతో కలిసి ప్రధాని కార్యక్రమం జరిగే ప్రదేశంలోకి ఎందుకు రావడానికి ప్రయత్నించారు? అనే అంశాలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో వారు అక్కడికి వచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ సెప్టెంబర్ 8న సాయంత్రం 5:45 గంటల సమయంలో ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026ను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు జరిగే ఈ ఏడో ఎడిషన్‌లో ఫైనాన్స్ భవిష్యత్తు, ఏజెంటిక్ AI, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితంపై చర్చలు జరగనున్నాయి. అంతకుముందు ప్రధాని గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 326 రూట్ కిలోమీటర్ల మూడు కీలక విభాగాలు ఉన్నాయి.

ప్రధాని ముంబై పర్యటనకు ముందు నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటం భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us