AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో వైరల్ డైట్స్..నమ్మితే మాత్రం ఆరోగ్యం రిపేర్

సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక కొత్త డైట్ వైరల్ అవుతోంది. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే చిట్కాలను గుడ్డిగా ఫాలో అయితే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒకరికి పనిచేసిన డైట్ ఇంకొకరికి పనిచేయాలని లేదు. మన శరీర తత్వాన్ని బట్టి సమతుల ఆహారం - కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్ అన్నీ సరైన మోతాదులో తీసుకోవడమే అసలైన ఆరోగ్యం. అందుకే సొంతంగా డైట్స్ మొదలుపెట్టకుండా క్లినికల్ డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 6:56 PM

Share
సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే రా ఫుడ్ డైట్, చిరుధాన్యాల డైట్ వంటివి చూద్దాం. పచ్చి కూరగాయలు, పండ్లే తింటే టాక్సిన్లు పోతాయని రా ఫుడ్ డైట్ లో చెబుతారు. పండ్లు మంచివే అయినా, కొన్ని కూరగాయలు వండకుండా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి, పూర్తి పోషకాలు అందవు. అలాగే వరి అన్నం మానేసి మూడు పూటలా చిరుధాన్యాలే తినడం వల్ల ఫైబర్ ఎక్కువైనా, నీళ్లు తక్కువ తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తుంది, థైరాయిడ్ ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయి.

1 / 5
కీటో, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, కార్నివోర్ డైట్స్ కూడా బాగా పాపులర్. కార్బోహైడ్రేట్లు మానేసి కొబ్బరి నూనె, వెన్న ఎక్కువగా తీసుకునే కీటో డైట్ తాత్కాలికంగా బరువు తగ్గించినా, దీర్ఘకాలంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది. 16 గంటలు ఉపవాసం ఉండే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ కొందరికి మేలు చేసినా, అసిడిటీ, అల్సర్, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా చేయకూడదు. కేవలం మాంసం, గుడ్లు మాత్రమే తినే కార్నివోర్ డైట్ లో ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం, పోషకాహార లోపం వస్తుంది.

2 / 5
తర్వాతివి లిక్విడ్ డైట్, వాటర్ ఫాస్టింగ్. కొన్ని రోజులు ఆహారం మానేసి జ్యూసులు, గ్రీన్ టీలే తాగితే బరువు తగ్గుతారని ప్రచారం చేస్తారు. నిజానికి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కాలేయం, కిడ్నీలు సహజంగానే పనిచేస్తాయి. కేవలం జ్యూసుల వల్ల ప్రోటీన్, ఫైబర్ లోపించి, షుగర్ లెవల్స్ పెరిగి, జుట్టు రాలడం, నీరసం వస్తాయి. 3 నుంచి 7 రోజులు నీళ్లు మాత్రమే తాగే వాటర్ ఫాస్టింగ్ మరీ ప్రమాదకరం. దీనివల్ల ఎలక్ట్రోలైట్లు పడిపోయి కళ్లు తిరగడం, గుండె స్పందనలో మార్పులు రావచ్చు.

3 / 5
చివరిగా వన్ మీల్ ఎ డే, పేలియో, మోనో డైట్స్. రోజంతా ఉపవాసం ఉండి ఒక్కపూటే తినే OMAD వల్ల ఒకేసారి అన్ని పోషకాలు శరీరం గ్రహించలేదు, తీవ్రమైన అసిడిటీ వస్తుంది.

4 / 5
 ధాన్యాలు, పాలు, చక్కెర మానేసి ఆదిమానవుల ఆహారం తినాలనే పేలియో డైట్ వల్ల క్యాల్షియం, విటమిన్-B లోపం వస్తుంది. కొన్ని రోజుల పాటు కేవలం అరటిపండ్లు లేదా యాపిల్స్ మాత్రమే తినే సింగిల్ ఫుడ్ / మోనో డైట్ అస్సలు శాస్త్రీయం కాదు, దీనివల్ల అత్యవసర పోషకాలు లోపించి తీవ్ర అనారోగ్యం బారిన పడతారు.

5 / 5
Follow Us