ఉధ్ధవ్ బల పరీక్ష… బీజేపీ ఛాలెంజ్ !

|

Nov 30, 2019 | 1:41 PM

శివసేన అధినేత, మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ థాక్రే.. శనివారం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యే శాసనసభలో ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెమ్ స్పీకర్ గా సభా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. అయితే సీక్రెట్ ఓటింగ్ అంటూ జరిగితే సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఓడిపోవడం తథ్యమని,. ఇది ఓపెన్ ఛాలెంజ్ అని బీజేపీ నేత చంద్రకాంత పాటిల్ అన్నారు. ట్రస్ట్ ఓటుకు ముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ […]

ఉధ్ధవ్ బల పరీక్ష... బీజేపీ ఛాలెంజ్ !
Follow us on

శివసేన అధినేత, మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ థాక్రే.. శనివారం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యే శాసనసభలో ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెమ్ స్పీకర్ గా సభా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. అయితే సీక్రెట్ ఓటింగ్ అంటూ జరిగితే సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఓడిపోవడం తథ్యమని,. ఇది ఓపెన్ ఛాలెంజ్ అని బీజేపీ నేత చంద్రకాంత పాటిల్ అన్నారు. ట్రస్ట్ ఓటుకు ముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ రావ్ చికిల్ఖర్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో భేటీ కావడం, పాటిల్ తాజాగా ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ఇలా ఉండగా.. శనివారం ఉదయం అజిత్ పవార్ పార్టీ సహచరుడు జయంత్ పాటిల్ తో కలిసి తన అంకుల్ శరద్ పవార్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు.

శాసన సభలో ఉధ్ధవ్ బల పరీక్ష సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. తమ మెజారిటీని సులభంగా నిరూపించుకుంటామని ఎన్సీపీకి చెందిన కొత్త మంత్రి ఛగన్ భుజ్ బల్ పేర్కొన్నారు. మాకు డిసెంబరు 3 వరకు గవర్నర్ గడువు ఇఛ్చినప్పటికీ ముందుగానే మా బలాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. అటు-అసెంబ్లీ కొత్త స్పీకర్ ను ఆదివారం ఎన్నుకోనున్నారు. సేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నానా పటోల్ ఈ పదవికి అభ్యర్థిగా ఉండవచ్చునని అంటున్నారు. అయితే బీజేపీ తరఫున ఈ పోస్టుకు ఎమ్మెల్యే కిషన్ కథోల్ అభ్యర్థిగా ఉంటారని ఈ పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికయ్యే స్పీకర్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.